రాంచరణ్ గ్లోబల్ స్టార్ అని పదేళ్ల క్రితమే పసిగట్టారా.. రచ్చ డైరెక్టర్ ట్వీట్ వైరల్, అప్పుడు కూడా వాళ్లే

Published : Feb 26, 2023, 08:33 PM IST
రాంచరణ్ గ్లోబల్ స్టార్ అని పదేళ్ల క్రితమే పసిగట్టారా.. రచ్చ డైరెక్టర్ ట్వీట్ వైరల్, అప్పుడు కూడా వాళ్లే

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లోనే పీక్ స్టార్ డమ్ చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర ఆస్కార్ ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల కోసం రాంచరణ్ యూఎస్ కి వెళ్లగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లోనే పీక్ స్టార్ డమ్ చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర ఆస్కార్ ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల కోసం రాంచరణ్ యూఎస్ కి వెళ్లగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు, ఈవెంట్ నిర్వాహకులు చరణ్ కి బ్రహ్మరథం పడుతున్నారు. 

గుడ్ మార్నింగ్ అమెరికా లాంటి పాపులర్ షోలో పాల్గొన్న తొలి ఇండియన్ నటుడిగా రాంచరణ్ చరిత్ర సృష్టించాడు. అలాగే హెచ్ సి ఏ అవార్డ్స్ వేదికపై ప్రజెంటర్ గా వ్యవహరించిన తొలి ఇండియన్ గా కూడా చరణ్ కి ఛాన్స్ దక్కింది. హెచ్ సి ఏ స్పాట్ లైట్ అవార్డుని కూడా చరణ్ దక్కించుకున్నాడు. 

విదేశాల్లో రాంచరణ్ హవా ఒక రేంజ్ లో సాగుతుండడంతో అభిమానులు గ్లోబల్ స్టార్ అని పిలవడం ప్రారంభించేసారు. ఏకంగా టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా రాంచరణ్ ని గ్లోబల్ స్టార్ గా అభివర్ణిస్తూ ట్వీట్ చేయడం విశేషం. గత కొన్ని రోజులుగా రాంచరణ్ గ్లోబల్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ నడుస్తోంది. 

అయితే తాజాగా రచ్చ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పదేళ్ల క్రితం రచ్చ చిత్రంలో రాంచరణ్ గురించి చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అయింది అని సంపత్ నంది పేర్కొన్నారు. రచ్చ టైటిల్ సాంగ్ లో ' హి ఈజ్ గోయింగ్ తో బి ఎ గ్లోబల్ స్టార్' అనే లిరిక్ ని చంద్రబోస్ రాశారు. 

దీని గురించి సంపత్ నంది ట్వీట్ చేస్తూ.. పదేళ్ల క్రితం రచ్చ చిత్రంలో రాంచరణ్ ఎంట్రీ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చంద్రబోస్ గారు సరైన విధంగా 'గ్లోబల్ స్టార్' అనే పదాన్ని ఈ పాటలో పెట్టారు. ఈ రోజు ప్రపంచం మొత్తం రాంచరణ్ ని గ్లోబల్ స్టార్ అని పిలుస్తోంది. యాదృచ్చికమో ఏమో కానీ.. రచ్చ టైటిల్ సాంగ్ కి చంద్రబోస్ అన్న లిరిక్స్ రాయగా.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 

ఇప్పుడు వాళ్లిద్దరే ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ ప్రభంజనంకి కూడా కారణం. గుడ్ లక్ ఫర్ ఆస్కార్స్ అని సంపత్ పేర్కొన్నారు. రచ్చ చిత్రం 2012లో విడుదలై మాస్ హిట్ గా నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు