#Yashoda:'యశోద'కి కోర్ట్ షాక్.. ఓటిటి రిలీజ్ ఆపాలని ఆదేశం

By Surya PrakashFirst Published Nov 24, 2022, 3:09 PM IST
Highlights

సినిమాలో చూపించిన హాస్పిటల్ పేరు వలన ప్రస్తుతం నడిచే ఇవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్ దాఖలు చేశారు. యశోద ప్రోడక్షన్ కి నోటీసులు జారీ చేశారు. 


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత  నటించిన మూవీ యశోద. హరి-హరీష్‌ డైరెక్ట్‌ చేసిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ రెండు వారాల క్రితం రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఓ వర్గంలో ఈ సినిమాపై మంచి  ఆసక్తి రేపింది. దాంతో ఇప్పటికే ఈ సినిమాని చూడని వారు ఓటిటిలో ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకు అనుకోని ట్విస్ట్ పడింది.

 ఈ సినిమాని OTTలో విడుదల కాకుండా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యశోద చిత్రం OTTలో విడుదల కాకుండా నిషేధం విధించింది కోర్టు. యశోద సినిమా విడుదలపై ఆదేశాలు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు అదనపు చీఫ్ జడ్జి. ఈ చిత్రం విడుదలపై ఈవీఏ ఐవీఎఫ్ హాస్పిటల్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.యశోద సినిమాలో సమంత క్యారెక్టర్ ఇవా హాస్పటల్ రేపిటేషన్ దెబ్బతినెలా చూపించారాని పిటిషన్ దాఖలు చేసింది హాస్పిటల్ యాజమాన్యం.

యశోద చిత్రంలో హాస్పిటల్ క్యారెక్టర్ ను దెబ్బ తీసే విధంగా చిత్రీకరించారని పిటిషన్ లో పేర్కొంది యాజమాన్యం. సినిమాలో చూపించిన హాస్పిటల్ పేరు వలన ప్రస్తుతం నడిచే ఇవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్ దాఖలు చేశారు. యశోద ప్రోడక్షన్ కి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 19వ తేదీ వరకు ఓటిటిలో యశోద మూవీ విడుదల చేయడానికి వీల్లేదంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది కోర్టు.

ప్రెగ్నెంట్ ఉమెన్ గా సమంత పాత్ర పవర్ ఫుల్ గా  ఈ సినిమాలో కనిపించింది. తనకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదురించి పోరాడే మహిళగా ఆమె కనిపించింది.. ఈ చిత్రంలో రావు రమేష్‌, సంపత్‌ రాజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఉన్నిముకుందన్‌తోపాటు కల్పిక ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి, హరీష్‌ దర్శకత్వం వహించగా.. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు.

click me!