Samantha: కాశ్మీర్‌లో సమంత హాట్‌ వర్కౌట్స్.. జిమ్‌లో తనతోపాటు వర్కౌట్‌ చేసే ఆ వ్యక్తి ఎవరూ?

Published : May 16, 2022, 08:43 AM IST
Samantha: కాశ్మీర్‌లో సమంత హాట్‌ వర్కౌట్స్.. జిమ్‌లో తనతోపాటు వర్కౌట్‌ చేసే ఆ వ్యక్తి ఎవరూ?

సారాంశం

కాశ్మీర్‌లో షూటింగ్‌ నేపథ్యంలో అక్కడ కూడా సమంత వర్కౌట్‌ చేస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పలు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే అక్కడ ఒంటరిగా కాకుండా మరో వ్యక్తితో కలిసి జిమ్‌ చేస్తుండటం విశేషం.

సమంత(Samantha) ఫిట్‌నెస్‌ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్‌కి సంబంధించి తోటి హీరోయిన్లకి ఆదర్శంగానూ నిలుస్తుంది. తన బాడీని ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంచుకోవడంలో ఆమె ముందుంటుంది. దానికోసం క్రమం తప్పకుండా వర్కౌట్‌ చేస్తుంది సమంత. ఈ విషయంలో రాజీపడేదేలేదు. ఎక్కడ ఉన్నా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వర్కౌట్స్ చేయాల్సిందే. అందుకు నిదర్శనమే ఆమె పంచుకున్న వర్కౌట్‌ వీడియోలు. అవి ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

సమంత ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉంది. విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)తో కలిసి ఆమె `VD11`(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాశ్మీర్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మంచి ఫ్యామిలీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన చిత్రంలో ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఇందులోనూ అవే హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 

కాశ్మీర్‌లో షూటింగ్‌ నేపథ్యంలో అక్కడ కూడా సమంత వర్కౌట్‌ చేస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పలు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే అక్కడ ఒంటరిగా కాకుండా మరో వ్యక్తితో కలిసి జిమ్‌ చేస్తుండటం విశేషం. మరి ఆమెతోపాటు జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అతనెవరో రివీల్‌ చేసింది సమంత. తన వ్యక్తిగత అసిస్టెంట్‌ అర్యన్‌ దగ్గుబాటితోకలిసి ఆమె జిమ్‌లో కష్టపడుతోంది. అతన్ని శ్రమపెడుతుంది. అయితే ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. `కలిసి పనిచేస్తే కుటుంబం కలిసి ఉంటుంది` అని పేర్కొంది. ఈ సందర్భంగా అర్యన్‌ని ట్యాగ్‌ చేసింది.

మరోవైపు జిమ్‌లో ఆమె వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో చాలా బరువైన వెయిట్‌ని లిఫ్ట్ చేస్తుండటం ఆకట్టుకుంటుంది. చాలా కష్టమైనప్పటికీ దాన్ని చేసింది సమంత. అయితే ట్రైనర్‌సమక్షంలోనే ఆమె ఈ వెయిట్‌ని లిఫ్ట్ చేసి అభిమానులతో శెభాష్‌ అనిపించుకుంటుంది. ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న `వీడీ11` చిత్రం నుంచి కాసేపట్లో(సోమవారం 9గంటలకు) ఫస్ట్ లుక్‌ రాబోతుంది. దీంతోపాటు టైటిల్‌ కూడా కన్ఫమ్‌ చేసే అవకాశాలున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే