`KGF3` ఇప్పట్లో లేనట్టే.. మూడో పార్ట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ జస్ట్ రిలాక్స్ !

Published : May 15, 2022, 10:22 PM IST
`KGF3` ఇప్పట్లో లేనట్టే.. మూడో పార్ట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ జస్ట్ రిలాక్స్ !

సారాంశం

`కేజీఎఫ్‌2`కి వస్తోన్న స్పందన నేపథ్యంలో యూనిట్‌ వెంటనే మరో సినిమా తీయాలని నిర్ణయించుకుందని నమ్మారు. కానీ ఇందులో నిజం లేదని తెలిపారు మరో నిర్మాత. హోంబలే ఫిల్మ్స్  నిర్మాతల్లో ఒకరైన కార్తీక్‌ గౌడ ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు. 

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాకి సంబంధించి ఎక్కడ చూసినా `కేజీఎఫ్‌ 2` గురించే చర్చ. ఆ సినిమా ఎన్ని కలెక్షన్లు చేసిందనేది హాట్‌ టాపిక్‌. `ఆర్‌ఆర్‌ఆర్‌`ని దాటుకుని, `బాహుబలి` రికార్డుల దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ సినిమా సృష్టించే సంచలనాలపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఈ మూవీ ఇప్పటికే ఇండియాలో వెయ్యి కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా సుమారు 12వందల (1170) కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే `కేజీఎఫ్‌ 2` ఎండింగ్‌లోనే మరో పార్ట్ రాబోతుందనే హింట్‌ ఇచ్చింది యూనిట్‌. `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 3` అంటూ చూపించి వదిలేశారు. దీంతో ఈ సినిమా సిరీస్‌ నుంచి మరో పార్ట్ రాబోతుందని అంతా భావిస్తూ వచ్చారు. అయితే మూడో భాగంపై ఈ చిత్ర నిర్మాత హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్‌ కిరగందూర్‌ స్పందించినట్టు శనివారం వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. `కేజీఎఫ్‌` సిరీస్‌ని మార్వెల్‌ సిరీస్‌ చిత్రాల మాదిరిగా తెరకెక్కించబోతున్నట్టు, ఈ ఏడాది నవంబర్‌ తర్వాత `కేజీఎఫ్‌ 3`ని స్టార్ట్ చేస్తామని ఆయన చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న `సలార్‌` షూటింగ్‌ నవంబర్‌ వరకు పూర్తవుతుందని, ఆ తర్వాత `కేజీఎఫ్‌3`ని స్టార్ట్ చేస్తామని, దీన్ని 2024లో విడుదల చేయనున్నామని ఆయన చెప్పినట్టుగా వార్తలు షికార్‌ చేయడంతో అంతా నమ్మారు. `కేజీఎఫ్‌2`కి వస్తోన్న స్పందన నేపథ్యంలో యూనిట్‌ వెంటనే మరో సినిమా తీయాలని నిర్ణయించుకుందని నమ్మారు. కానీ ఇందులో నిజం లేదని తెలిపారు మరో నిర్మాత. హోంబలే ఫిల్మ్స్  నిర్మాతల్లో ఒకరైన కార్తీక్‌ గౌడ ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు. 

`సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా వద్ద చాలా మంచి ప్రాజెక్ట్ లున్నాయి. వాటిపైనే మా దృష్టి ఉంది. ఇప్పట్లో హోంబలే సంస్థ `కేజీఎఫ్‌ 3`ని తెరకెక్కించలేదు. ఒకవేళ ఈ సినిమా చేయాలనుకుంటే తప్పకుండా అధికారిక ప్రటన చేస్తాం` అని కార్తీక్‌ గౌడ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోతున్నారు. 

ఎందుకంటే `కేజీఎఫ్‌ 3` వెంటనే ప్రారంభించబోతున్నారనే వార్తతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ చేయబోయే ప్రాజెక్ట్‌ పై అనేక అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా ఉంటుందా? లేదా అనే డౌన్‌ మొదలయ్యాయి. `కేజీఎఫ్‌3` పూర్తయ్యాక ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందా? అనే సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా నిర్మాత ట్వీట్‌ తారక్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ రిలీఫ్ నిచ్చింది. అంతేకాదు అనేక ఊహాగానాలకు చెక్‌ పెట్టినట్టయ్యింది. ఈ లెక్కన ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ సినిమా అనుకున్న టైమ్‌కే స్టార్ట్ కాబోతుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే