
బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సావిత్రి(శివజ్యోతి) విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించింది ఆషురెడ్డి. ఈ మేరకు ఆమె జుబ్లిహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటింది. ఈ సందర్బంగా తనకు ఈ ఛాలెంజ్ ఇచ్చిన శివ జ్యోతికి, ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఆషురెడ్డి.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మన బాధ్యత అని అశు రెడ్డి అన్నారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీనరి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సన్నీ, దీపక్ సరోజ్, జశ్వంత్ ముగ్గురు నటులకు ఆషురెడ్డి సవాల్ విసిరింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆషురెడ్డి అందంగా ముస్తాబై ఎట్రాక్ట్ చేస్తుంది.