శకుంతలగా సమంత.. మరో అద్భుత ప్రేమ కావ్యాన్ని చెప్పబోతుందా?

Published : Dec 27, 2020, 08:12 PM IST
శకుంతలగా సమంత.. మరో అద్భుత ప్రేమ కావ్యాన్ని చెప్పబోతుందా?

సారాంశం

సినిమాలు లేకపోయినా మల్టీఫుల్‌ వర్క్ తో బిజీగా గడుపుతోంది సమంత. అయితే `జాను` చిత్రం తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయని సమంత ఇప్పుడు ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమానే ఫైనల్‌ చేసిందట. 

సమంత ఓ వైపు `సామ్‌జామ్‌` టాక్‌ షోతో, మరోవైపు అరడజను టీవీ యాడ్స్ తో ఫుల్‌ బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సినిమాలు లేకపోయినా ఇలా మల్టీఫుల్‌ వర్క్ తో బిజీగా గడుపుతోంది. అయితే `జాను` చిత్రం తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయని సమంత ఇప్పుడు ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమానే ఫైనల్‌ చేసిందట. 

గుణశేఖర్‌ `శాకుంతలం` పేరుతో ఓ సినిమాని రూపొందించబోతున్నారు. దీన్ని ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రానాతో `హిరణ్య కశ్యప` చిత్రం చేయాల్సింది. అయితే దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి `శాకుంతలం` సినిమా తీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అంతేకాదు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది. 1889లో ఈ నాటకం నార్వే, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషల్లోకి అనువాదం అయ్యింది. 

ఓ అద్భుతమైన ప్రేమ కావ్యంగా దీన్ని రూపొందించబోతున్నారు. అయితే ఇందులో శకుంతల పాత్రలో సమంతని తీసుకునే ఆలోచనలో ఉన్నారట గుణశేఖర్‌. మరో ముఖ్య పాత్ర అయిన దుష్యంత మహారాజుగా ఎవరు నటిస్తారనేది ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి సంబంధించి జనవరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. అందులో శకుంతలగా సమంత పేరుని ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే