సూపల్‌ కూల్‌ సల్మాన్‌కి చిరు, వెంకీ, మహేష్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published : Dec 27, 2020, 05:58 PM ISTUpdated : Dec 27, 2020, 10:54 PM IST
సూపల్‌ కూల్‌ సల్మాన్‌కి చిరు, వెంకీ, మహేష్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు

సారాంశం

సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్ తో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అందుకు ముందుగానే వారికి సందేశాన్ని అందించారు. ఎవరూ తన కోసం రావద్దని చెప్పారు. అయితే సల్మాన్‌కి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు.

బాలీవుడ్‌ కండల వీరుడు, బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ నేటితో 55ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్‌లోనే అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచిన సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్ తో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అందుకు ముందుగానే వారికి సందేశాన్ని అందించారు. ఎవరూ తన కోసం రావద్దని చెప్పారు. అయితే సల్మాన్‌కి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగా స్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, మహేష్‌బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి చెబుతూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు డియర్‌ బ్రదర్‌ సల్మాన్‌ ఖాన్‌. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షిస్తున్నా` అని తెలిపారు. 

విక్టరీ వెంకటేష్‌ సైతం సల్మాన్‌కి విషెస్‌ తెలిపారు. `అత్యంత అద్భుతమైన, దయగల హృదయం కలిగిన స్నేహితుడు, సోదరుడు సల్మాన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడు ఆనందం, విజయం, మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా` అని చెబుతూ, ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇద్దరూ స్కూటీలపై ఫ్రెండ్లీగా దిగిన ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ స్పందిస్తూ, సూపర్‌ కూల్‌ సల్మాన్‌కి బర్త్ డే విషెస్‌. మంచి ఆరోగ్యం, సంతోషం, శాంతి ఉండాల`ని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?