ఫ్యామిలీ ప్లానింగ్ కోసం షారుక్ మూవీ వదులుకున్న సమంత!

By team telugu  |  First Published Oct 18, 2021, 11:21 PM IST

సమంత పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదని, ఆమె గతంలో అబార్షన్ కూడా చేయించుకున్నారనేది మరొక వాదన. అయితే ఈ వార్తల్లో ఎటు వంటి నిజం లేదని తెలుస్తుంది. నిజానికి పిల్లల్ని కనాలనే ఆలోచనతో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని కూడా Samantha వదులుకున్నారట. 



సమంత naga chaitanya విడాకుల వెనుక కారణాల పరిశోధన కొనసాగుతుంది. ఇప్పటికే పలు వాదనలు వినిపించాయి. ముఖ్యంగా సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జూకాల్కర్ కారణం అంటూ కథనాలు వెలువడ్డాయి. గతంలో ప్రీతమ్ తో సమంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి తీస్తూ, ఈ వాదనలో నిజం ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ ఆరోపణలపై సమంత ప్రత్యక్షంగా స్పందించలేదు. అయితే ప్రీతమ్ పెదవి విప్పారు. సమంత తనకు అక్కతో సమానమని, తమ రిలేషన్ గురించి నాగ చైతన్యకు తెలుసు అని కామెంట్ చేశారు. 

అలాగే సమంత పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదని, ఆమె గతంలో అబార్షన్ కూడా చేయించుకున్నారనేది మరొక వాదన. అయితే ఈ వార్తల్లో ఎటు వంటి నిజం లేదని తెలుస్తుంది. నిజానికి పిల్లల్ని కనాలనే ఆలోచనతో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని కూడా Samantha వదులుకున్నారట. అట్లీ దర్శకత్వంలో Shahrukh khan హీరోగా తెరకెక్కుతున్న లయన్ సినిమా కోసం మొదట సమంతనే సంప్రదించారట. 

Latest Videos

Also read ఆ లిస్ట్ లో రష్మిక - సమంత! అందరూ షాక్

ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచనలో ఉన్న సమంత సదరు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట సమంత తిరస్కరించిన అనంతరం ఆ ఆఫర్ నయనతార వద్దకు వెళ్లిందని సమాచారం. దర్శకుడు Atleeతో సమంతకు మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన తేరీ, మెర్సల్ చిత్రాలలో సమంత హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. 

Also read నువ్విక్కడ లేకున్నా భయంగా ఉంది.. నాపై అంత అధికారం ఎవరిచ్చారు, సమంత పోస్ట్ వైరల్
కాగా సమంత పిల్లల కనాలని గట్టి విశ్వాసంతో ఉన్నారని, ఆమె దీని కోసం ప్రణాళికలు వేసుకున్నట్లు శాకుంతలం నిర్మాత నీలిమ గుణ తెలిపారు. కాబట్టి సమంత పిల్లలను వద్దనుకున్నారు. గతంలో అబార్షన్ చేయించుకున్నారనే వార్తలలో నిజం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. 2017 అక్టోబర్ 6న వివాహం చేసుకున్న సమంత, నాగ చైతన్య ఈనెల 2న విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. 
 

click me!