ప్రభాస్ బర్త్ డే సీడీపీ... ఇండియా లెవెల్ లో ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!

Published : Oct 18, 2021, 10:29 PM IST
ప్రభాస్ బర్త్ డే సీడీపీ... ఇండియా లెవెల్ లో ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!

సారాంశం

 ప్రభాస్ బర్త్ డే నాడు ఆయన అప్ కమింగ్ చిత్రాల నుండి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. సదరు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాధే శ్యామ్ చిత్ర టీజర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. 

వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ బిగ్ సెలెబ్రేషన్స్ కి సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 23న Prabhas బర్త్ డే నేపథ్యంలో పెద్ద పండుగలా జరుపుకోనున్నారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ సీడీపీని ఆవిష్కరించడం జరిగింది. ఫ్యాన్స్ మొత్తం ప్రభాస్ సీడీపీ ఫోటోను తమ డీపీలుగా మార్చేశారు. ఆయన బర్త్ డే సీడీపీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 


కాగా ప్రభాస్ బర్త్ డే నాడు ఆయన అప్ కమింగ్ చిత్రాల నుండి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. సదరు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాధే శ్యామ్ చిత్ర టీజర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా Radhe shyam సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 


మరోవైపు మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్ చిత్రీకరణ చివరి దశకు చేరింది. హీరోయిన్ కృతి సనన్ తన పార్ట్ కి సంబంధించిన షూట్ పూర్తి చేసినట్లు, సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న Salaar చిత్రీకరణ దశలో ఉంది. 2022 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. సలార్, ఆదిపురుష్ చిత్రాల నుండి కూడా లేటెస్ట్ అప్డేట్స్ రానున్నాయని సమాచారం. 

Also read కోట్ల ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య రాయల్ ఎంట్రీ... ఎవరి గిఫ్ట్ అంటే!
ఈ మూడు చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగ తో  ప్రకటించిన Spirit చిత్రాలలో ప్రభాస్ నటించాల్సి ఉంది. ప్రభాస్ 26వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఉంటుంది అంటూ ఓ ప్రచారం సాగుతుండడం విశేషం. మొత్తంగా ప్రభాస్ తన పుట్టినరోజు నాడు లెక్కకు మించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేయనున్నాడు. 

Also read హాలీవుడ్ హీరోల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న ప్రభాస్... స్పిరిట్ కోసం అన్ని కోట్లా!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు