
స్టార్ హీరోయిన్ సమంతకి శాకుంతలం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల విడుదలైన శాకుంతలం చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. సమంత స్టార్ పవర్ ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది.
అయితే ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న చిత్రం ఖుషి. మహానటి చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
పవన్, మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలతో నటించిన సామ్ ప్రస్తుతం కుర్రహీరోల చిత్రాలకు ఓకె చెబుతోంది. ఫిలిమ్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు సమంత డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ సరసన నటించేందుకు ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సిద్దు జొన్నలగడ్డ, నందిని రెడ్డి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. నందిని రెడ్డి, సిద్దు ఆ విషయాన్ని ఆల్రెడీ ధ్రువీకరించారు. అయితే హీరోయిన్ గా నందిని రెడ్డి సమంతని ఫైనల్ చేసినట్లు.. ఆమె ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సిద్దు జొన్నలగడ్డ ఎలాంటి రొమాంటిక్ హీరోనో అందరికీ తెలిసిందే. గుంటూరు టాకీస్, డీజే టిల్లు చిత్రాల్లో సిద్దు బాగా రెచ్చిపోయాడు. మరి సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుని ఛాన్స్ వస్తే గాల్లో తేలిపోతాడేమో. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.