పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు, హైదరాబాద్ లో ఓజీ సెకండ్ షెడ్యూల్.. ఎప్పటినుంచంటే..?

Published : May 18, 2023, 11:18 AM ISTUpdated : May 18, 2023, 11:19 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు, హైదరాబాద్ లో ఓజీ సెకండ్ షెడ్యూల్.. ఎప్పటినుంచంటే..?

సారాంశం

ఓజీ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా లాగించేస్తున్నాడు డైరెక్టర్ సుజిత్.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూళ్లు కంప్లీట్ అయ్యాయి. రీసెంట్ డేస్ వరకూ ముంబయిలో మేజర్  షెడ్యూల్స్‌ ను కంప్లీట్ చేశారు టీమ్.  

టాలీవుడ్ టాప్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో జోరుమీద ఉన్నాడు. ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడు. ఏడాది ఏలాగైనా తన సినిమాలు కంప్లీట్ చేసి.. ఎలక్షన్ మూమెంట్ కు వెళ్లాలని చూస్తున్నాడు. అందుకే  ఈ ఏడాది వీలైనన్ని సినిమాలు కంప్లీట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు స్టార్ సీనియర్ హీరో. ఈ ఏడాది పవన్‌ కల్యాణ్‌ డైరీ ఖాళీగా లేదు. వరుసగా నాలుగు సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందులో  సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న సినిమా ఓజీ. 

 ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అనే  వర్కింగ్‌ టైటిల్‌  రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్‌ బ్యాక్ డ్రాప్ లో.. యాక్షన్ తో పాటు  ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.  మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా లాగించేస్తున్నాడు డైరెక్టర్ సుజిత్.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూళ్లు కంప్లీట్ అయ్యాయి. రీసెంట్ డేస్ వరకూ ముంబయిలో మేజర్  షెడ్యూల్స్‌ ను కంప్లీట్ చేశారు టీమ్. ఇక యాక్షన్ సీన్స్ తో పాటు.. ఓ సాంగ్ షూట్ ను కూడా చేసినట్టు తెలుస్తోంది. 

తాజాగా ఓజీ షూటింగ్ ఈరోజు(18 మే) నుంచి  సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు మూవీ టీమ్. తెలియజేస్తూ.  ఇందులో కీలకమైన టాకీ పార్ట్‌ను తెరకెక్కిస్తారని చెబుతున్నారు. ‘ఓజీ’ షూటింగ్‌ విషయంలో పవన్‌కల్యాణ్‌ దూకుడుగా ఉన్నారని, సాధ్యమైనంత తొందరలో చిత్రాన్ని పూర్తి చేయబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈమూవీతో పాటు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్.. మరో మూడు సినిమాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ తో ఉస్తాడ్ భగత్ సింగ్ షూటింగ్ దాదాపు కంప్లీట్ చేశాడు పవర్ స్టార్. తాజాగా ఈమూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కు పవర్ స్టార్ ప్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇక సముద్ర ఖనితో తమిళ డబ్బింగ్ సినిమా చేస్తున్నాడు పవన్.. అటు క్రిష్ తో హరిహరవీరమల్లు సినిమా కూడా పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇలా ఈ ఏడాది వరకూ అన్ని సినిమాలు కప్లీట్ చేసి.. ఏపీ పాలిటిక్స్ లో బిజీ కాబోతున్నాడు పవర్ స్టార్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?