సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ, ఇంటిదొంగను పట్టుకున్న పోలీసులు

Published : May 18, 2023, 10:03 AM IST
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ, ఇంటిదొంగను పట్టుకున్న పోలీసులు

సారాంశం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రియ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. అయితే ఇది చేసింది ఇంటిదొంగలే అని కనిపెట్టిన పోలీసులు.. కేసును వెంటనే ఛేదించారు. 

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు ఎంతో ఇష్టమైన చెల్లెలు  అర్పిత ఖాన్. ఆమె ఇంట్లో తాజాగా చోరి జరిగింది. అర్పితా ఖాన్ కు సబంధించిన చెవి పోగులు పోయినట్టు ఆమో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే వాటి విలువ 5 లక్షలకు పైనే ఉంటాయని.. అవి వజ్రాలతో చేసినట్టు పేర్కొన్నారు.  తన మేకప్ ట్రేలో వాటిని పెట్టినట్టు తెలిపిన ఆమె.. ఆతరువాత తన విలువైన చెవిపోగులు మాయమైయ్యాయంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అర్పిత చేసిన ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇది ఇంటిదొంగల పనే అని తేల్చారు. అర్పితా ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న వ్యాక్తిపై అనుమానంతో  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పనిమనిషిని విచారించి అతని నుంచి అర్పితా ఖాన్‌కు చెందిన వజ్రాల చెవిపోగులను ముంబై పోలీసులు రికవరీ చేశారు. అర్పిత ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న 30 ఏళ్ళ సందీప్ హెగ్డే ఈ పని చేసినట్టు గుర్తించారు పోలీసులు. 


అర్పితా ఖాన్ ఇంట్లో 11 మంది పనివాళ్ళు ఉన్నారు. అయితే వారిలో  30 ఏళ్ళ సందీప్ హెగ్డే మాత్రం ఈ దొంగతనం చేసినప్పటి నుంచీ కనిపించడం లేదు. ఎవరికి సమాచారం కూడా ఇవ్వలేదని..దాంతో అతన్ని ట్రేస్ చేసి పట్టుకుని విచారించినట్టు.. ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ మోహన్ మానే తెలిపారు.  ఈ క్రమంలో సందీప్ నుంచి చెవి పోగులు రికవరీ చేసి అతనిపై సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.కాగా, సల్మాన్‌ ఖాన్‌కి సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు, ఇంకా అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్ అనే ఇద్దరుచెల్లెల్లు ఉన్నారు. అయితే అర్పితా ఖాన్ ను సల్మాన్ ఖాన్ దత్తత తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా