సమంత తన ఫ్యాన్స్ కి న్యూ ఇయర్‌ గిఫ్ట్ రెడీ..

Published : Dec 30, 2020, 10:36 AM IST
సమంత తన ఫ్యాన్స్ కి న్యూ ఇయర్‌ గిఫ్ట్ రెడీ..

సారాంశం

సమంత కూడా వెబ్‌ సిరీస్‌ చేసింది. పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ `ఫ్యామిలీ మేన్‌ 2`లో కీలక పాత్ర పోషిస్తుంది సమంత. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ వెబ్‌ సిరీస్‌ లో సమంతది నెగటివ్‌ టచ్‌ ఉన్న రోల్‌. 

స్టార్‌ హీరోయిన్లు సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. రకుల్‌, రాశీ, తమన్నా ఇలా అందరు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. సమంత కూడా వెబ్‌ సిరీస్‌ చేసింది. పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ `ఫ్యామిలీ మేన్‌ 2`లో కీలక పాత్ర పోషిస్తుంది సమంత. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ వెబ్‌ సిరీస్‌ లో సమంతది నెగటివ్‌ టచ్‌ ఉన్న రోల్‌. ఇందులో సమంత పాత్ర కొత్త కోణంలో సాగుతుందట. గతంలో ఎన్నడూ చూడని యాంగిల్‌లో సమంత చూస్తారని చెబుతోంది సమంత. 

బాలీవుడ్‌ మేకర్స్ రాజ్‌ అండ్‌ డీకే దీన్ని రూపొందించారు. ఇప్పటికే మొదటి భాగం మంచి ఆదరణ పొందగా, త్వరలో రెండో భాగం విడుదల కాబోతుంది. అయితే దీన్ని న్యూ ఇయర్‌ గిఫ్ట్ గా ప్రసారం కానుందట. ఈ విషయాన్ని సమంత వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ వెబ్‌ సిరీస్‌ ఫోటోని పంచుకుంది. ఇది అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కాబోతుంది. 

సమంత ప్రస్తుతం `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా విజయ్‌ దేవరకొండ, రానా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మెగాస్టార్‌ చిరంజీవి వంటి వారు ఇందులో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా బన్నీఎపిసోడ్‌ ప్రసారం కానుంది. మరోవైపు రోజుకో సెక్సీ ఫోటోతో అభిమానులను అలరిస్తుంది సమంత. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anupama Parameswaran: రష్మికలా వెయ్యి కోట్ల సినిమాలు చేయలేదు, కానీ కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.. 6 సినిమాలతో విశ్వరూపం
Chiranjeevi: చిరంజీవి తనని తాను అద్దం ముందు చూసుకుని అనుకున్న మాట.. కోరిక తీర్చబోతున్న డైరెక్టర్