రకుల్‌ కి నెగటివ్‌.. ఫుల్‌ ఎనర్జీతో వస్తుందట..

Published : Dec 30, 2020, 07:34 AM IST
రకుల్‌ కి నెగటివ్‌.. ఫుల్‌ ఎనర్జీతో వస్తుందట..

సారాంశం

 రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కరోనా నెగటివ్‌ వచ్చింది. మంగళవారం టెస్ట్ చేయించుకోగా నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ ఇన్‌ స్టా స్టోరీస్‌లో వెల్లడించింది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కరోనా నెగటివ్‌ వచ్చింది. మంగళవారం టెస్ట్ చేయించుకోగా నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నెల 22న రకుల్‌ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయ్యిందని ప్రకటించింది. తనకి పెద్దగా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించింది. ఎవరూ ఆందోళన చెంద వద్దని, తాను మరింత స్ట్రాంగ్‌గా మారతానని వెల్లడించింది. 

తాజాగా తనకు నెగటివ్‌ వచ్చిందని వెల్లడించింది. `కరోనా టెస్ట్ రిజల్ట్ నెగటివ్‌ అని చెప్పడానికి సంతోషిస్తున్నా. నేనిప్పుడు చాలా హెల్దీగా ఉన్నాను. అందరి ప్రేమాభిమానాలు, త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్థనలకు థ్యాంక్స్. 2021ను ఆరోగ్యంతో, ఆశావాహ దృక్పథంతో ప్రారంభిస్తాను. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. మాస్కులు కచ్చితంగా ధరించండి, జాగ్రత్తలు తీసుకోండి` అని రకుల్‌ వెల్లడించింది. 

మరోవైపు ప్రస్తుతం వరుసగా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉందట ఈ సెక్సీ బ్యూటీ. ప్రస్తుతం రకుల్‌ తెలుగులో నితిన్‌తో `చెక్‌`, క్రిష్‌-వైష్ణవ్‌ తేజ్‌ సినిమాతోపాటు తమిళంలో కమల్‌తో `ఇండియన్‌ 2`, శివకార్తికేయన్‌తో `అయలన్‌`, హిందీలో అర్జున్‌ కపూర్‌తో `సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌ సన్‌`, జాన్‌ అబ్రహంతో `ఎటాక్‌`, అజయ్‌ దేవగన్‌, బిగ్‌బీలతో `మేడే` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరోనే నా గాడ్‌ఫాదర్‌.. టాలీవుడ్ విలన్ ఆసక్తికర కామెంట్స్..
నటుడు మోహన్‌లాల్ ఇంట్లో విషాదం, తల్లి శాంతకుమారి కన్నుమూత!