
సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాదు.. సెన్సేషనల్ స్టార్ అయిపోయింది. ఆమె జీవితంలోనూ బిగ్ టర్న్ తీసుకోవడం, కెరీర్ పరంగానూ నెక్ట్స్ స్టెప్ తీసుకోవడంతో ఇప్పుడు సమంత అంటే ఓ సంచలనంగా మారింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత ఆమె లైఫ్ స్టయిలే మారిపోయింది. వ్యక్తిగతంగా తన స్ట్రగుల్స్ నుంచి బయటపడుతున్న సమంత బోల్డ్ అప్రోచ్‌తో ముందుకు సాగుతుంది. తాను ఏం చేయాలనుకుంటుందో అది చేసేందుకు రెడీ అవుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది.
ఇక కెరీర్ పరంగానూ ఫుల్ బిజీ అవుతుంది సమంత. ఆమె చేతిలో ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాలుండటం విశేషం. తెలుగులో ఆమె `శాకుంతలం` చిత్రంలో నటించింది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే చైతూతో విడాకుల ప్రకటనకు ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఊసు లేదు. `శాకుంతలం`కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మర్చిపోయిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరంసందర్భంగా క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు.
`శాకుంతలం` అప్‌డేట్‌కి సంబంధించి విడుదల చేసిన వీడియోలో దర్శకుడు గుణశేఖర్ సారథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అర్థమవుతుంది. గుణశేఖర్ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చెన్నైలోని ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఈ వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుంది. `శాకుంతలం` చిత్రంలో గ్రాఫిక్స్ కి స్కోప్ ఉంటుంది. ప్రధానంగా గ్రాఫిక్స్ మీదే ఆధారపడి సాగే చిత్రమిది. దీంతో ఫుల్ స్వింగ్‌లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుందని తెలిపారు.
సమంత..శకుంతలంగా నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇందులో భరత పాత్రలో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే తెరపైకి తీసుకురాబోతున్నారు. దీంతోపాటు సమంత `యశోద` అనే ఓ బైలింగ్వల్ చిత్రం చేస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. అలాగే డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఓ బైలింగ్వల్ చిత్రం, హిందీలో ఓ సినిమా, అలాగే ఓ అంతర్జాతీయ చిత్రం చేస్తుంది సమంత. తెలుగులో ఎన్టీఆర్, మహేష్‌లతో సినిమాలు చేయబోతుందని టాక్. ఇటీవల `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా.. ` అనే ఐటెమ్ సాంగ్‌లో సమంత హాట్ స్టెప్పులేసి ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇకపై తాను బోల్డ్ గానూ కనిపించేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది.