
బాలీవుడ్ తారల వారసులు ట్రెండ్ ని అందిపుచ్చుకోవడంలో చాలా వేగంగా ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న యువ హీరోయిన్లు ఎక్కువ మంది సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారే. జాన్వీ కపూర్, సారా లి ఖాన్ లాంటి ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఎలా అందాలు ఆరబోస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా 41 ఏళ్ల బాలీవుడ్ నటి Shweta Tiwari సినిమాలు, టివి సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది.
శ్వేతా తివారీకి 21 ఏళ్ల పాలక్ తివారి కుమార్తె. ఈ యంగ్ బ్యూటీ త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీనితో పాలక్ ని నెటిజన్లు గమనిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అవుతున్నారు. సెలెబ్రిటీలు చిన్న పొరపాటు చేసినా అది నెట్టింట రచ్చ రచ్చగా మారుతుంది.
తాజాగా సోషల్ మీడియాలో శ్వేతా తివారి, పాలక్ తివారి ఇద్దరూ దారుణమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. శ్వేతా తివారి, పాలక్ ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. పాలక్ తివారి రీసెంట్ గా 'బిజ్లీ బిజ్లీ' అనే మ్యూజిక్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ విజయవంతం కావడంతో విక్టరీ బ్యాష్ నిర్వహించారు. ఈ పార్టీకి తల్లీకూతుళ్లు ఇద్దరూ హాజరై డాన్స్ చేశారు.
ఈ పార్టీలో పాలక్ తివారి ఎద అందాలు కనిపించేలా బ్రా లాంటి డ్రెస్ లో బోల్డ్ గా కనిపించింది. ఆమె డ్రెస్సింగ్ పై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆమె తల్లి శ్వేతా తివారీని కూడా టార్గెట్ చేస్తున్నారు. నీ కూతురికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నేర్పించు, ఇలాంటి డ్రెస్ లో తల్లీకూతుళ్లు ఇద్దరూ చిందులేయడానికి సిగ్గు లేదా అని ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.