నా శక్తి 50 శాతం తగ్గిపోయింది.. ఫుడ్ కూడా తగ్గించా, ఆ బాధ వర్ణించలేం అంటున్న సమంత

Published : Mar 28, 2024, 03:49 PM IST
నా శక్తి 50 శాతం తగ్గిపోయింది.. ఫుడ్ కూడా తగ్గించా, ఆ బాధ వర్ణించలేం అంటున్న సమంత

సారాంశం

సమంత మయోసైటిస్ కి గురై తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మయోసైటిస్ తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫక్ట్స్ ని అధికమించడానికి కూడా సమంతకి చాలా సమయం పట్టిందట.

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఏడాది కాలంగా సమంత ఆరోగ్య సమస్యలతో పోరాటం చేస్తోంది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంది. 

సమంత మయోసైటిస్ కి గురై తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మయోసైటిస్ తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫక్ట్స్ ని అధికమించడానికి కూడా సమంతకి చాలా సమయం పట్టిందట. అందుకే ఖుషి తర్వాత పూర్తిగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. తాజాగా సమంత పాడ్ కాస్ట్ లో అప్పటి పరిస్థితులని గుర్తు చేసుకుంది. 

సిటాడెల్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు. ట్రైనింగ్ సెషన్ లో నా శక్తి సగానికి గట్టిపోయింది. ఆ విషయం నాకు అర్థం అయింది. దీనికి తోడు భారీ యాక్షన్ సీన్స్ లో నటించాల్సి వచ్చేది. ఒకవైపు మయోసైటిస్, మరోవైపు గాయాలు ఇలా పూర్తిగా వర్ణించలేని బాధని అనుభవించా. 

నా బాడీ త్వరగా హీల్ కావడానికి ఆహారం కూడా తక్కువగా తీసుకునేదానిని. దీనితో నా శక్తి బాగా తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే 50 శాతం పడిపోయింది. చాలా కాలం పాటు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కండరాల నొప్పులు విపరీతాంగా ఉండేవి అని సమంత ఆ కఠిన పరిస్థితులని గుర్తు చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే