అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ పోలిశెట్టి.. డీటెయిల్స్

By tirumala ANFirst Published Mar 28, 2024, 1:13 PM IST
Highlights

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకి మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్ తో నవీన్ అలరిస్తున్నాడు. 

నవీన్ పోలిశెట్టి ఇప్పటి వరకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా నవీన్ పోలిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ యుఎస్ లో ఉంటున్నాడు. అక్కడ బైక్ పై వెళుతూ స్కిడ్ కావడంతో కింద పడి గాయాల పాలయ్యాడట. 

చేతికి బలమైన గాయం కావడంతో ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. నవీన్ ఇక్కడ ఉన్న తన టీం కి మెసేజ్ పంపాడట. గాయం నుంచి కోలుకోవడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని అప్పటి వరకు ఎలాంటి షూటింగ్ లో పాల్గొనలేనని నవీన్ మెసేజ్ పెట్టాడట. 

నవీన్ మెసేజ్ తోనే ఈ న్యూస్ బయటకి వచ్చింది. నవీన్ కేవలం చేతి గాయంతో బయట పడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. నవీన్ తన తదుపరి చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. 

click me!