
స్టార్ హీరోయిన్ సమంత ఇక అభిమానులకు గుడ్ బై చెప్పింది. తాను ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అభిమానులకు గుడ్ బై చెప్పింది. అభిమానులతోపాటు చిత్ర యూనిట్‌కి ఆమె బై చెప్పింది. మళ్లీ వచ్చేంత వరకు బై చెప్పింది. ప్రస్తుతం సమంత పంచుకున్న ఎమోషనల్ నోట్ వైరల్ అవుతుంది. మరోవైపు ఈ రోజు(జులై13) తన లైఫ్‌లో చాలా స్పెషల్ డే అవుతుందని పేర్కొంది.
సమంత ఇటీవల `ఖుషి` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తాజాగా `సిటాడెల్` వెబ్ సిరీస్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇది హాలీవుడ్ `సిటాడెల్`కి రీమేక్. ఇండియాన్ లాంగ్వేజెస్లో రూపొందుతుంది. ఇందులో వరుణ్ దావన్ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా సమంత నటిస్తుంది. `ది ఫ్యామిలీ మ్యాన్` మేకర్స్ రాజ్ డీకే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ నేటి(గురువారం)తో పూర్తయ్యింది. దీంతో అధికారికంగా సమంత ఏడాది గ్యాప్‌కి సిద్ధమైంది.
ఈ సిరీస్ షూటింగ్ సందర్భంగా సమంత ఓ ఎమోషనల్ నోట్‌ని పంచుకుంది. `సిటాడెల్` షూటింగ్ పూర్తయ్యింది. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది బ్యాడ్ విషయమేమీ కాదు. రాజ్ డీకే లాంటి ఫ్యామిలీ అవసరం. ప్రతి ఒక్క యుద్ధంలో పోరాడటానికి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఎప్పుడూ నన్ను వదులుకోలేదు. ప్రపంచంలోని అన్నింటికంటే మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా. జీవితకాలపు పాత్రని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మరో పాత్ర నాకోసం రాసేంత వరకు థ్యాంక్స్` అని చెప్పింది సమంత. ఈ సందర్భంగా `సిటాడెల్` మేకర్స్ తో దిగిన ఫోటోని పంచుకుంది సమంత.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత స్పందిస్తూ, జులై 13 ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని, సిటాడెల్ షూటింగ్ పూర్తయ్యిందని సమంత పేర్కొంది. ఇక సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. పూర్తిగా తన ఆరోగ్యంపై దృష్టిపెట్టబోతుంది. రెట్టింపు ఎనర్జీతో, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చేందుకు రెడీ అవుతుందీ అందాల భామ. అయితే తాజాగా సమంతకి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగులో సమంత .. విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాని విడుదల చేయబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన తొలి పాటకి మంచి స్పందన లభించింది. తాజాగా `ఆరాధ్య` అంటూ సాగే రెండో పాట విడుదలై శ్రోతలను అలరిస్తుంది.