మంత్రి రోజాతో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి!

Published : Jul 13, 2023, 03:18 PM ISTUpdated : Jul 13, 2023, 03:20 PM IST
మంత్రి రోజాతో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి!

సారాంశం

స్టార్ యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆమె మంత్రి రోజాతో పాటు తిరుమల వెళ్లారు. దర్శనం అనంతరం మంత్రి రోజా-శ్రీముఖి కలిసి ఫోటోలు దిగారు.   

స్టార్ యాంకర్ శ్రీముఖి కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఏపీ టూరిజం శాఖామంత్రి రోజాతో కలిసి శ్రీముఖి తిరుమల సందర్శించారు. షూటింగ్స్ తో బిజీగా ఉండే శ్రీముఖి కొంచెం గ్యాప్ తీసుకుని తిరుమలకు రావడం జరిగింది. మంత్రి రోజా, శ్రీముఖి దర్శనం అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. తిరుమల టూర్ కి సంబంధించిన ఫోటోలు శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

తమ్ముడు, అమ్మానాన్నలతో కలిసి శ్రీముఖి తిరుమలకు వచ్చారు. శ్రీముఖి బ్యూటీఫుల్ ఫ్యామిలీ పిక్స్ నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఇక శ్రీముఖి కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. షోల పరంగా చూస్తే శ్రీముఖి నంబర్ వన్ యాంకర్. పలు ఛానల్స్ లో వివిధ షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. ఆల్రెడీ శ్రీముఖి నటిగా రాణిస్తున్నారు. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేశారు. 

హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారని సమాచారం. చిన్నా చితకా చిత్రాలు చేయడం వలన డబ్బులు వచ్చినా కెరీర్ కి నష్టమని ఆమె భావిస్తున్నారట. అందుకే ఆలస్యమైనా పర్లేదు. పేరున్న నటులు దర్శకులతో పని చేయాలని కోరుకుంటున్నారట. ఆగస్టు 11న విడుదల కానున్న భోళా శంకర్ మూవీలో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 

తరచుగా శ్రీముఖి పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నాకు అప్పుడే పెళ్లి ఆలోచన లేదు. కుదిరినప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాను. మీరు పుకార్లు లేపకండి అంటూ.. చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు