అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సమంత

Published : Aug 28, 2017, 01:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సమంత

సారాంశం

అర్జున్ రెడ్డి మూవీకి సమంత ప్రశంసలు సహజత్వంతో చాలా రియలిస్టిక్ గా వుందని అభినందన విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి  ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సమంత

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీ టాలీవుడ్ సెన్సేషన్  గా మారిపోవడంతో  ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలు కూడ జోరుగానే వస్తున్నాయి.    అడల్ట్ కంటెంట్ అని సెన్సార్ తీర్పు ఇచ్చినా ఆ విషయాలు పట్టించుకోకుండా కేవలం యూత్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు.

 

ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తూ విడుదలైన మూడు రోజులకే... బయ్యర్లను లాభాల్లోకి తీసుకు వచ్చింది. ఈచిత్రాన్ని ఒరిజినాలిటికీ దగ్గరగా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవర కొండను అందరు వరుసపెట్టి తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే నాని, వరుణ్ తేజ్, అను ఇమాన్యుయేల్ తదితరులు అర్జున్ రెడ్డిని పొగడేశారు.

 

అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లిస్ట్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా చేరిపోయింది. "చాలా కాలం తర్వాత నేను చూసిన సినిమాల్లో సహజత్వానికి దగ్గరగా ఉన్న మూవీ అర్జున్ రెడ్డి. టాలీవుడ్ కి గోల్డెన్ డేస్ మనతోపాటే ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ టీం అద్భుతం" అంటూ ట్విట్ చేసింది సమంత. తన సినిమాలను మాత్రమే కాకుండా మూవీ బాగుంటే ఇతర హీరో హీరోయిన్ల సినిమాలను కూడ అభినందిస్తూ ప్రమోట్ చేసే సమంత చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.  

 

ఇది ఇలా ఉండగా  త్వరలో సమంత-విజయ్ దేవరకొండ కలిసి ఓ మూవీలో నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మహానటి సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటిలో ఓ జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుండగా ఎన్టీఆర్ ఏఎన్నార్ రోల్స్ లో ఒకటి విజయ్ దేవరకొండతో చేయిస్తున్నారనే టాక్ ఉంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి