Latest Videos

సైకో కిల్ల‌ర్‌ గా రానా? ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్

By Surya PrakashFirst Published Jul 3, 2024, 6:05 AM IST
Highlights

 ఈ చిత్రంలో  రానా ని విలన్ గా అడిగారని తెలుస్తోంది.  ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. బావ, బావ అని పిలుచుకుంటారు. 


దగ్గుపాటి రానా ..బాహుబలి చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత అలాంటి పాత్రలు వచ్చినా వాటి జోలికి పోకుండా హీరోగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి రానా ...నెగిటివ్ పాత్రలో కనిపించే అవకాసం ఉందని తెలుస్తోంది. అదీ సైకో కిల్లర్ పాత్రలో అంటున్నారు. ఈ వార్తలో నిజమెంత ఉందో కానీ ప్రస్తుతానికైతే వైరల్ అవుతోంది. రానా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటి..

హీరో నాని (Nani) ప్రొడ్యూస్ చేసిన ‘హిట్‌’, హిట్‌-2 (Hit 2)చిత్రాలు ఏ రేంజి సక్సెస్ సాధించాయో తెలిసిందే. ఇప్పుడీ  ఫ్రాంచైజీని   కంటిన్యూ చేయాలనుకుంటున్నారు నాని. ఈ రెండు చిత్రాలకు నిర్మాతగానే వ్యవహరించిన నాని  'హిట్‌ 3’లో (hit 3) లో మాత్రం హీరోగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. 

ఇక ఈ చిత్రంలో  రానా ని విలన్ గా అడిగారని తెలుస్తోంది.  ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. బావ, బావ అని పిలుచుకుంటారు. ఓ అవార్డు వేడుకకు ఇద్దరూ హోస్ట్‌లుగా వ్యవహరించారు. కానీ తెరపై కనిపించబోతుండడం ఇదే  తొలిసారి. ఇప్పటికే శైలేష్‌ కొలను  కథ రెడీ చేసి , నాని చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నట్లు సమాచారం.  మొదటి రెండు  హిట్ చిత్రాలు లాగానే ఈ సారి కూడా ఓ సైకో కిల్లర్ ని పట్టుకునే పోలీస్ అధికారి కథ అంటున్నారు. 
 
ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చేస్తున్నారు. ఆ సినిమా అయ్యాక   శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా  ఉందని తెలుస్తోంది. ఇక  'దసరా’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో మరో సినిమా చేయడానికి నాని రెడీ అవుతున్నాడు.  అయితే ఈ గ్యాప్ లోనే  ‘హిట్‌ 3’ని ఫినిష్‌ చేసేందుకు ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం.  

‘హిట్’లో యంగ్ హీరో విశ్వక్​సేన్ నటించగా.. ‘హిట్ 2’లో మరో యువ కథానాయకుడు అడివి శేష్ అలరించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, చివరి వరకు కొనసాగే సస్పెన్స్ అంశాలతో ఈ థ్రిల్లర్స్ మంచి విజయాలు సాధించాయి. ‘హిట్ 2’ ఆఖర్లో నానీని చూపించి డైరెక్టర్ మెప్పించాడు. మూడో పార్ట్​కు ఆయనే హీరో అని రివీల్ చేశాడు. 
 

click me!