బాల నటుడిగా అనేక సూపర్ హిట్ చిత్రాలతో సుపరిచయం అయిన తేజ సజ్జా ఇప్పుడు చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు. తేజ సజ్జా ట్యాలెంట్ కి తగ్గ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.
బాల నటుడిగా అనేక సూపర్ హిట్ చిత్రాలతో సుపరిచయం అయిన తేజ సజ్జా ఇప్పుడు చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు. తేజ సజ్జా ట్యాలెంట్ కి తగ్గ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ.. తేజ సజ్జా హీరోగా ఆంజనేయస్వామి బ్యాక్ డ్రాప్ లో సూపర్ హీరో మూవీ ప్రకటించినప్పుడు చిన్న హీరోతో ఇంత పెద్ద చిత్రమా అనే కామెంట్స్ వినిపించాయి. అలా కామెంట్స్ చేసిన వారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంతో పాటు తేజ సజ్జా ఆల్రౌండ్ పెర్ఫామెన్స్ హను మాన్ చిత్రంలో హైలెట్ గా నిలిచింది. బడా సెలెబ్రిటీలంతా హను మాన్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా స్టార్ బ్యూటీ సమంత హను మాన్ చిత్రం ప్రశంసల వర్షం కురిపించారు.
సోషల్ మీడియాలో సమంత సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. 'మనల్ని బాల్యంలోకి తీసుకెళ్లగలిగితే ఆ చిత్రం ఉత్తమ చిత్రం అనే చెప్పాలి. హను మాన్ చిత్రంలో ప్రతి అంశం అద్భుతంగా ఉంది. విజువల్స్, కామెడీ , మ్యూజిక్ అన్ని బావున్నాయి. ఇంతటి అద్భుత చిత్రం తెరకెక్కించిన ప్రశాంత్ వర్మకి కృతజ్ఞతలు తెలపాలి. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రాబోయే మరిన్ని చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
బుల్లి హీరో తేజ సజ్జాని సమంత ప్రత్యేకంగా అభినందించింది. తేజ సజ్జా నటన చూసి నేను ఆశ్చర్యపోయా. తేజ సజ్జా అమాయకత్వం, కామెడీ టైమింగ్.. హనుమంతుగా తేజా సజ్జా నటన హను మాన్ చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ లని కూడా సమంత అభినందించింది.