`గుంటూరు కారం`పై ట్రోల్స్, నెగటివ్ కామెంట్లపై నిర్మాత నాగవంశీ స్పందించారు. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. వారి ప్లాన్ బెడిసి కొట్టిందన్నారు.
మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన `గుంటూరు కారం` సినిమా సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ విపరీతమైన నెగటివ్ కామెంట్లని ఎదుర్కొంది. దారుణంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాతోపాటు మీడియాలోనూ దీనిపై నెగటివ వార్తలు కనిపించాయి. అర్థరాత్రి నుంచే సినిమా బాగాలేదంటూ వరుసగా ట్వీట్లు దర్శనమిచ్చాయి. దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు. తనదైన స్టయిల్‌లో పచ్చిగా కౌంటర్లు ఇచ్చాడు.
అర్థరాత్రి షోస్ వేయడం పెద్ద మైనస్ అయ్యిందన్నారు. తాము సినిమా కంటెంట్ ఏంటనేది ఆడియెన్స్ కి రీచ్ చేయలేకపోయామని, దీంతో సినిమాని ఆడియెన్స్ ఒకలా ఊహించుకున్నారని, కానీ సినిమా అలా లేకపోవడంతో డిజప్పాయింట్ అయ్యారని తెలిపారు. `గుంటూరు కారం` త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కానీ సినిమా మాస్ కమర్షియల్ మూవీగా ప్రొజెక్ట్ అయ్యింది. ఫ్యామిలీ అంశాలను తాము ఆడియెన్స్ కి చెప్పలేకపోయాం. దీంతో వాళ్ల అంచనాలను మూవీ అందుకోలేకపోయింది. అదే నెగటివ్ ప్రచారానికి కారణమైందని తాము భావిస్తున్నట్టు తెలిపారు.
దీంతోపాటు మీడియాపై గట్టిగానే కౌంటర్లు వేశారు. సోషల్ మీడియాలో ప్రచారంతోపాటు మీడియాలో కొంత మంది కావాలని సినిమాపై నెగటివ్ వార్తలు పోస్ట్ చేశారని, టార్గెట్ చేశారని తెలిపారు. సినిమా ఆడదని, డిజాస్టర్ అంటూ చెప్పడమే కాదు, చాలా సంతోషించారని, కానీ వాళ్లని అంచనాలను, కామెంట్లని దాటి సినిమా పెద్ద విజయం సాధించిందన్నారు. తాజాగా సినిమా కలెక్షన్లే అందుకు కారణమని తెలిపారు.
చాలా చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందన్నారు. ఏపీలో 90శాతం సినిమా బయ్యర్లు సేఫ్ అని తెలిపారు. ఇంకా కొంత మిగిలిఉందని, మున్ముందు వాళ్లు కూడా సేఫ్ అవుతారని చెప్పారు. ఆంధ్రాతో పోల్చితే నైజాంలో తక్కువగా ఉన్నట్టు తెలిపారు. సినిమాపై నెగటివ్ రివ్యూల ప్రభావం ఏమాత్రం లేదని తెలిపారు. కొందరు కావాలని నెగటివ్ ప్రచారం చేశారని, కానీ అదేదీ సినిమా కలెక్షన్లని కంట్రోల్ చేయలేకపోయిందన్నారు. తమపై కొందరు అతి ప్రేమ చూపించారని, వాళ్లకి ఈ వసూళ్లే సమాధానం చెబుతాయని, అంతగా సంతోషించినందుకు, అతిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ సెటైర్లు పేల్చారు నాగవంశీ.
మహేష్‌బాబు, త్రివిక్రమ్ లో బెస్ట్ కి సంబంధించి చెబుతూ, మహేష్ బాబు అద్భుతంగా డాన్సులు చేశాడని, లుక్ వైజ్‌గా చాలా అందంగా ఉన్నాడని, ఫైట్స్ లోనూ ఇరగదీశాడని తెలిపారు. ఆయన వన్ మ్యాన్ షో చేశాడని, తెరపై చాలా బాగా కనిపించారని తెలిపారు. అయితే ఇవన్నీ చేయించింది త్రివిక్రమ్ అని, ఆ క్రెడిట్ త్రివిక్రమ్ కూడా వెళ్తుందని తెలిపారు. త్రివిక్రమ్ రూపొందించిన `గుంటూరు కారం` సినిమాలో మహేష్ కి జోడీగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి మరో పాత్రలో మెరిసింది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలై వారం రోజులు రెండు వందల కోట్లని దాటినట్టు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ కలెక్షన్లు ఫేక్ కలెక్షన్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న నేపథ్యంలో రాంగ్ అని నిరూపించమని నిర్మాత నాగవంశీ సవాల్ విసిరారు. వాస్తవ కలెక్షన్లు ఏంటో చెప్పాలని ఆయన వెల్లడించారు. కొందరు సినిమాపై నెగటివ్ ప్రచారం చేయాలనుకున్నా, అది వర్కౌట్ కాలేదని, వారి ప్లాన్ బెడిసి కొట్టిందని, అందుకు కలెక్షన్లే నిదర్శమని చెప్పారు నాగవంశీ.