కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్.. సమంత ఎలా రిప్లై ఇచ్చిందో చూశారా..

Published : Apr 12, 2024, 07:33 PM IST
కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్.. సమంత ఎలా రిప్లై ఇచ్చిందో చూశారా..

సారాంశం

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ కి యువతలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందినప్పటికీ కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. 

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ కి యువతలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందినప్పటికీ కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. యువతతో, సెలెబ్రిటీలతో కేటీఆర్ ఎక్కువగా మమేకం అవుతుంటారు. 

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కేటీఆర్ కి చాలా మంది నటీనటులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కేటీఆర్ సోదరి కవిత ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. 

దీనితో ఆమెని బయటకి తీసుకువచ్చేందుకు కేటీఆర్, కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పార్టీలో అంతర్గతంగా ఊహించని కుదుపు వచ్చింది. బహుశా ఈ పరిస్థితుల వాళ్లేమో కానీ.. తాజాగా కేటీఆర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

నీకు జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కొనాలి అంటూ తన పిక్ పోస్ట్ చేశారు. ఊహించని విధంగా కేటీఆర్ పోస్ట్ కి స్టార్ బ్యూటీ సమంత రిప్లై ఇచ్చింది. చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజి పోస్ట్ చేసింది. 

 

కేటీఆర్ తో సమంతకి మంచి సాన్నిహిత్యం ఉంది. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమెని చేనేత వస్త్రాలకు బ్రాండ్  అంబాసిడర్ గా నియమించారు. ఇదిలా ఉంచితే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సమంత గురించి కూడా ఏవేవో రూమర్స్ వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ కి సమంత ఇచ్చిన రిప్లై తప్పకుండా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు