మూడు పెళ్లిళ్లు అయ్యాయి ఫర్వాలేదా? పవన్ పై పూనమ్ కౌర్ మళ్ళీ ఏసేసిందిగా!

Published : Apr 12, 2024, 06:21 PM IST
మూడు పెళ్లిళ్లు అయ్యాయి ఫర్వాలేదా? పవన్ పై పూనమ్ కౌర్ మళ్ళీ ఏసేసిందిగా!

సారాంశం

పూనమ్ కౌర్ సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. ఆమె తరచుగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆమె పరోక్షంగా సెటైర్ వేశారు.   

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులు అనడంలో సందేహం లేదు. జల్సా మూవీ టైం లో ముడిపడిన వీరి బంధం కొనసాగుతుంది. ఇద్దరూ వేదిక పంచుకున్నారంటే ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకుంటారు. పదాలు ప్రవాహంగా పుట్టుకొస్తాయి. కాగా వీరిద్దరికీ ఓ కామన్ విలన్ ఉంది. ఆమె ఎవరో కాదు పూనమ్ కౌర్. సందు దొరికితే చాలు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మీద మాటల దాడి చేస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లతో ఆమె కలిసి పని చేసింది లేదు. 

కాగా గతంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. పూనమ్ కౌర్ ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మోసం చేశారని తీవ్రమైన అలిగేషన్స్ చేశాడు. టీవీ డిబేట్లలో కూర్చుని పవన్, త్రివిక్రమ్ కారణంగా పూనమ్ కౌర్ జీవితం నాశనం  అయ్యిందన్నారు. కత్తి మహేష్ ఆరోపణలను పూనమ్ కౌర్ కుటుంబ సభ్యులు ఖండించడం విశేషం. 

అయితే పూనమ్ కౌర్ మాత్రం పవన్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుంది. ఆమె తీరు చూస్తుంటే ఏదో వివాదం నడిచిన మాట వాస్తవం అనిపిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పై ఆమె పరోక్షంగా కామెంట్స్ చేసింది. వైసీపీ ప్రభుత్వ సానుభూతి పరుడైన ఓ నెటిజన్... ఆంధ్రప్రదేశ్ లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు చేయాలని ఎలన్ మస్క్ ని రిక్వెస్ట్ చేశాడు. సదరు నెటిజెన్ లండన్ లో ఉండే డాక్టర్. 

సదరు డాక్టర్ ట్వీట్ ని కోట్ చేసిన పూనమ్ కౌర్.. అతనికి మూడు పెళ్లిళ్లు, పర్లేదుగా? అని కామెంట్ పెట్టింది. వైసీపీ నేతలు తరచుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఏపీ సీఎం జగన్ పలుమార్లు పవన్ పెళ్లిళ్ల గురించి వేదికలపై విమర్శలు చేశాడు. ఈ క్రమంలో మరి ఎలన్ మస్క్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. వైసీపీ సానుభూతి పరుడిగా నీకు ఓకేనా అనే అర్థంలో పూనమ్ కామెంట్ చేసింది. పూనమ్ ట్వీట్ వైరల్ అవుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి రజినీకాంత్ రాయబారం నిజమేనా? ముహూర్తం ఎప్పుడంటే?
Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?