చైతు కోసం ఏడుకొండలేక్కేసిన సామ్!

Published : Apr 02, 2019, 04:12 PM ISTUpdated : Apr 02, 2019, 04:14 PM IST
చైతు కోసం ఏడుకొండలేక్కేసిన సామ్!

సారాంశం

ఎలాగైనా చైతుకి తనద్వారా మరో హిట్టివ్వాలని సమంత ఆరాటపడుతోంది.

సమంత - నాగ చైతన్య.. ఇద్దరి కెరీర్ లు దాదాపు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. చైతూకి మొదటి విజయం సమంత ద్వారానే వచ్చింది. ఏ మాయ చేసావే తరువాత మనం సినిమాతో  కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కాంబినేషన్ కి ఒక మంచి గుర్తింపు దక్కింది. ఇక అప్పుడే మనసులు కూడా బాగా దగ్గరయ్యాయి. 

అందుకే ఆటో నగర్ సూర్య అనే మరో సినిమా చేశారు. కానీ సినిమా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇకపోతే పెళ్లి తరువాత సమంత హిట్స్ తో దూసుకుపోతుంటే చైతు మాత్రం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎలాగైనా చైతుకి తనద్వారా మరో హిట్టివ్వాలని సమంత ఆరాటపడుతోంది. మజిలీ సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో సమంత దర్శకుడితో చర్చలు జరిపి జాగ్రత్తలు తీసుకుంది. 

ఇక ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా భర్త కోసం సామ్ ఏడుకొండలు ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకుంది.  క్రిస్టియన్ అయినప్పటికీ భర్తకు ఇష్టమైన దేవుడిని కాలినడకన దర్శించుకున్న సమంత నిజంగా గొప్ప ప్రేమికురాలని చెప్పవచ్చు. ఇక నాగ చైతన్య ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారితోపాటు బ్రహ్మానందం కూడా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే