నాకు కూడా పిల్లలు కావాలి కానీ చైతు మాత్రం.. సమంత కామెంట్స్!

Published : Sep 11, 2018, 03:59 PM ISTUpdated : Sep 19, 2018, 09:22 AM IST
నాకు కూడా పిల్లలు కావాలి కానీ చైతు మాత్రం.. సమంత కామెంట్స్!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, సమంతలు వివాహం చేసుకొని వచ్చే నెలకి ఏడాది పూర్తవుతుంది. పెళ్లైన తరువాత మొదటిసారి ఆమెకు పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. సమంత నటించిన 'యూటర్న్' సినిమా విడుదల సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది సమంత

అక్కినేని నాగచైతన్య, సమంతలు వివాహం చేసుకొని వచ్చే నెలకి ఏడాది పూర్తవుతుంది. పెళ్లైన తరువాత మొదటిసారి ఆమెకు పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. సమంత నటించిన 'యూటర్న్' సినిమా విడుదల సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది సమంత.

ఈ సందర్భంగా ఆమెకు ఎదురైన ప్రశ్నకు.. ''పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైతు మాత్రం రెడీగా లేడు. నాకైతే పిల్లలు కావాలనే ఉంది కానీ ఈ ఈ విషయంలో చైతుని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. పిల్లలు ఎప్పుడనేది ఇంకా ప్లాన్ చేయలేదు. చైతు ఎప్పుడు అంటే అప్పుడే'' అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలుంటే చైతుని అడగమని సలహా ఇస్తోంది.

యూటర్న్, చైతు నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' ఒకేరోజు విడుదల అవుతున్న విషయంపై మాట్లాడుతూ.. ''ఓ భార్యగా నా భర్త సంతోషం నాకు చాలా ముఖ్యం. అతడికి సక్సెస్ రావాలని కోరుకుంటాను. నాకు ఏదైనా చైతు తరువాతే. కాకపోతే యూటర్న్ సినిమాను నేను ఎంతో ఇష్టపడి చేశాను. ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు