ఎలాగైనా సినిమాను ఆడించమని రాఘవేంద్రరావు కోరారు.. సురేష్ బాబు కామెంట్స్!

By Udayavani DhuliFirst Published 11, Sep 2018, 3:32 PM IST
Highlights

ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న సినిమా పేరు 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు చూపించి పాజిటివ్ వైబ్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు

ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న సినిమా పేరు 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు చూపించి పాజిటివ్ వైబ్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓ మంచి సినిమాను రిలీజ్ చేశామనే సంతృప్తితో ఉన్నారు రానా, సురేష్ బాబులు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఇందులో సురేష్ బాబు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ''ఈ వారం 'శైలజా రెడ్డి అల్లుడు, యూటర్న్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల కోసం 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాను ఎక్కడ థియేటర్లలో నుండి తీసేస్తారోననే ఆలోచనతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నాకు ఫోన్ చేసి ఎలాగైనా ఈ సినిమాను బాగా ఆడించి.

ఇటువంటి సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీకి మంచిది. ఇటువంటి సినిమాలు ఆడాలి అప్పుడే కొత్త కొత్త సినిమాలు వస్తాయి. త్వరలోనే పెద్ద ఫంక్షన్ చెయ్.. నేను వచ్చి అందరికీ షీల్డులు ఇస్తాను అంటూ ఫోన్ చేసి చెప్పారని'' సురేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం సినిమాకు వస్తోన్న స్పందనతో తను సంతోషంగా లేనని మరింత మంది సినిమా చూస్తేనే సంతోషమని అన్నారు. 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST