ఇదీ 'ఫసక్' అంటే.. పెద్ద సమస్య సాల్వ్ అయింది.. మంచు మనోజ్ ట్వీట్!

By Udayavani DhuliFirst Published 11, Sep 2018, 3:05 PM IST
Highlights

మంచు మనోజ్ కి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారితో అన్ని విషయాలు పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతున్నారు

మంచు మనోజ్ కి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారితో అన్ని విషయాలు పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతున్నారు.

మంచు మనోజ్ ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతూటున్నారు. సోషల్ మీడియాలో కూడా తన సరదా ట్వీట్ లతో అభిమానులను నవ్విస్తుంటాడు. తాజాగా మంచు మనోజ్ మరో ట్వీట్ పెట్టి అభిమానులను నవ్విస్తున్నాడు.

ఒక వ్యక్తి ఫోర్క్ స్పూన్ తో నూడిల్స్ ని తీసుకొని వాటిని కట్ చేసి తింటున్న వీడియోని షేర్ చేసిన మంచు మనోజ్.. ''ఇప్పుడు నూడిల్స్ సమస్య సాల్వ్ అయింది. 'ఫసక్' బై ఇండియన్'' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి నెటిజన్లు సరదాగా స్పందిస్తూ.. ''నూడిల్స్ తినే విధానం ఇదా.. నాకిప్పుడు తెలిసింది'' అంటూ ఒకరు.. ''ఇలా తినాలని తెలియక నార్మల్ గా తినేస్తున్నాను'' అంటూ మరొకరు రకరకాలుగా స్పందిస్తున్నారు.  

 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST