
ఆ మధ్యన సమంత ...తాను కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న ఫొటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఈ నేపధ్యంలో ఎప్పటికప్పుడు సమంత ఆరోగ్య పరిస్దితి ఏమిటి...ఆమె ఏ ట్రీట్మెంట్ తీసుకుంటోందనే విషయమై అభిమానులు ఆసక్తిగా చర్చలు జరుపుతున్నారు.
మైయోసిటిస్ అనేది Auto-Immune Condition. ఈ పరిస్థితిలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన స్వంత కణజాలాలపైనే పొరపాటుగా దాడి చేస్తుంది. ఫలితంగా కండరాలలో వాపు, బలహీనత, దద్దుర్లను కలిగిస్తుంది. ఇది బాధాకరమైన మంట, నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. మయోసిటిస్ చికిత్స రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సను పోలి ఉంటుంది. లక్షణాలను నయం చేయటానికి వైద్యులు తగిన మందులను అందిస్తారు. ఫిజియోథెరపీ, ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ, స్టెరాయిడ్స్‌తో చికిత్స, DMARDలు మొదలైన అన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. సమంతకు ఈ విషయమై అమెరికాలో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుందని వినికిడి. ఇప్పుడు బాగా కోలుకుందని తెలుస్తోంది.
అయితే ఈ మయోసైటిస్ కంటూ ఓ కచ్చితమైన ట్రీట్మెంట్ లేదు. మయోసిటిస్ లక్షణాలను నియంత్రించడానికి ట్రీట్మెంట్, మందులు ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ మయోసిటస్‌ను నయం చేయడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఇమ్యునోస్ప్రెసివ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఈ ట్రీట్మెంట్ వాడతారని వివరించారు. వీటితో పాటు వ్యాయామం, స్ట్రెచింగ్, యోగా, పోషకర ఆహారం మయోసిటిస్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ నేపధ్యంలో సమంత ఆయుర్వేద ట్రీట్మెంట్ ని ఫ్రిఫర్ చేస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న సమంత.. ఇంటిదగ్గర ఉండే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకుంటుందని అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునేలా ఈ చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. సామ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది అని, సమంత పై వస్తున్న వార్తలు నమ్మొద్దని తనకు కోలుకుంటుందని చెప్పుకొచ్చారు సామ్ మేనేజర్.
సమంత రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా శాకుంతలం అనే సినిమాలో కూడా నటిస్తుంది సామ్. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.