'ఖైదీ' ప్రొడక్షన్ హౌస్ లో సమంత కొత్త చిత్రం!

pratap reddy   | Asianet News
Published : Oct 15, 2021, 04:23 PM IST
'ఖైదీ' ప్రొడక్షన్ హౌస్ లో సమంత కొత్త చిత్రం!

సారాంశం

సినిమాల పరంగా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా సమంత తన వృత్తిని దూరం చేసుకోవడం లేదు. నటిగా అద్భుతమైన చిత్రాలు చేస్తోంది. 

సినిమాల పరంగా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా సమంత తన వృత్తిని దూరం చేసుకోవడం లేదు. నటిగా అద్భుతమైన చిత్రాలు చేస్తోంది. విజయదశమి సందర్భంగా సమంత కొత్త చిత్రానికి ప్రకటన వచ్చింది. 

Samantha నెక్స్ట్ మూవీ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో ఉండబోతోంది. కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు శాంతరూబేన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించబోతున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ లో ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తెలుగు,తమిళ ద్విభాషా చిత్రంగా ఈమూవీ తెరకెక్కనుంది. డ్రీమ్ వారియర్స్ సంస్థ హీరో కార్తీతో 'ఖైదీ' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించారు. ఇక సమంత చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇతర నటీనటుల్ని త్వరలో ప్రకటిస్తారు. 

Also Read: శ్రీయ శరన్ కిల్లింగ్ లుక్స్.. ఎంత అందంగా ఉందో కదా, ఆ విషయంలో మంచు లక్ష్మి సపోర్ట్

సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక గాధ Shaakuntalam చిత్రంలో నటిస్తోంది. శకుంతల, దుశ్యంతుడు కథని గుణశేఖర్.. శకుంతల కోణంలో చూపించబోతున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కే ఈ చిత్రం సమంత అభిమానులకు ట్రీట్ కానుంది. ఇప్పటి వరకు సమంత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసినప్పటికీ పౌరాణిక గాథలో ఇంతవరకు చేయలేదు. శాకుంతలం చిత్రంలో సమంత పాత్ర షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఆ తర్వాత సామ్ కొంత విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ గ్యాప్ లో చైతో విభేదాలతో విడిపోయింది. తిరిగి మళ్ళీ సామ్ వర్క్ లో నిమగ్నం కానుంది. సమంత ఓ బాలీవుడ్ చిత్రానికి కూడా సైన్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Family man 2 తర్వాత సమంత బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది.  

 

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?