మాస్‌ మహారాజా రవితేజ నయా మూవీ `ధమాకా` ఫస్ట్ లుక్‌.. డబుల్‌ ఇంపాక్ట్ ఉంటుందట..

Published : Oct 15, 2021, 01:55 PM IST
మాస్‌ మహారాజా రవితేజ నయా మూవీ `ధమాకా` ఫస్ట్ లుక్‌.. డబుల్‌ ఇంపాక్ట్ ఉంటుందట..

సారాంశం

రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రవితేజకిది 69వ చిత్రం కావడం విశేషం. విజయదశమి సందర్భంగా ఈ చిత్రానికి టైటిల్‌ని ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు.

మాస్‌ మహారాజా రవితేజ కొత్త సినిమాల విషయంలో జోరు పెంచారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు రవితేజ. ప్రస్తుతం ఆయన `ఖిలాడీ`, `రామారావు ఆన్‌ డ్యూటీ` చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా విజయదశమి సందర్భంగా కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు. ఫస్ట్ లుక్ ని రిలీజ్‌ చేశారు. 

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో raviteja ఓ సినిమా చేస్తున్నారు. రవితేజకిది 69వ చిత్రం కావడం విశేషం. విజయదశమి సందర్భంగా ఈ చిత్రానికి టైటిల్‌ని ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. `ధమాకా` అనే టైటిల్‌ని నిర్ణయించారు. `డబుల్‌ ఇంపాక్ట్` ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ప్రస్తుతం dhamaka movie first look వైరల్‌ అవుతుంది. రవితేజకిది పర్‌ఫెక్ట్ టైటిల్‌ అని అంటున్నారు అభిమానులు. ఇది ఆద్యంతం ఫన్‌ ఎంటర్‌టైన్‌గా ఉండబోతుందని తెలిపారు. 

also read: బిగ్ అప్డేట్: రాంచరణ్, గౌతమ్ తిన్ననూరి మూవీ ఖరారు.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో!

ట్యాగ్‌లైన్‌ చూస్తుంటే రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌, విశ్వప్రసాద్‌ టీజీ, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా రవితేజ, రమేష్‌వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న `ఖిలాడి` కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. మరోవైపు శరత్‌ మాండవ దర్శకత్వంలో `రామారావు ఆన్‌ డ్యూటీ` సినిమాలో నటిస్తున్నారు రవితేజ. దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటిస్తుంది.

ఇక దర్శకుడు త్రినాథరావు నక్కిన `సినిమాచూపిస్త మావ` చిత్రంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత `నవ్వలా నేనిలా`తో మెప్పించారు. నాని, కీర్తిసురేష్‌లతో చేసిన `నేను లోకల్‌`తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. చివరగా ఆయన రామ్‌తో `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాన్ని రూపొందించగా, ఇది పరాజయం చెందింది. 

also read: క్లోజప్‌లో టాప్‌ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి ఫెస్టివల్‌ హాట్‌ ట్రీట్‌ ఇచ్చిన మాళవిక మోహనన్‌..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్