
కెరీర్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏదంటే... చైతూ కాంబినేషన్లో చేసిన తొలి సినిమా 'ఏమాయ చేసావె' పేరే సమంత చెప్పింది. ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య పెర్ఫామెన్స్ గురించి ఓ ప్రశ్న అడిగితే.. అతణ్ని చూసి గర్వంగా ఫీలవుతున్నానని సమంత పేర్కొంది.
జీవితంలో అందుకున్న అత్యంత ముఖ్యమైన సలహా ఏదని అడిగితే.. 'ప్రతి సినిమానూ నీ తొలి సినిమాలాగే ఫీలవ్వు' అన్న మహేష్ బాబు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది సమంత. మీ బలం ఏంటని అడిగితే.. నాకేం కావాలో నాకు తెలవడమే అని సమంత బదులిచ్చింది.
ఇక పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ సమంతా అంటూ వస్తున్న వార్తలు అబద్ధమని సమంత క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో విక్రమ్ 'ఇంకొక్కడు' సినిమాలోని 'హెలెనా' తనకు నచ్చిన పాట అని చెప్పింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అత్యంత ఇష్టమైంది ఏదంటే 'సుల్తాన్' అని చెప్పింది.