
`బిచ్చగాడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు మిథున్ మాన్యూల్ థామస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రియలిస్టిక్ పంథాలో ఆవిష్కరించారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో పాటు, మ్యాజిక్ ఆద్యంతం రక్తికట్టించేలా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
`ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా.. సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది. సన్ని వాయ్‌నే, లియోనా లిషాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.