
నాగచైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని వారింటి కోడలుగా మారిన సమంత ఇప్పుడు క్లౌడ్ నైన్ పై వుంది. అక్టోబర్ మొదటి వారం పెళ్లి చేసుకున్న చైతూ, సమంతలు దొరికిన కొంత గ్యాప్ లో హనీమూన్ ట్రిప్ కోసం లండవ్ వెళ్లారు. తాజాగా తిరిగి వచ్చిన నేపథ్యంలో విందు ఏర్పాటు చేయాలని నాగ్ నిర్ణయించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో చైతూ సమంత రిసెప్షన్ కు ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.
అక్టోబరు 6న గోవాలో జరిగి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాలేదు. అందుకే హైదరాబాద్‌లో చైతూ, సమంత మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. చైతూ, సమంత బిజీగా పెళ్లి తర్వాత చైతూ, సమంత తమ పనులతో బిజీగా ఉండటంతో రిసెప్షన్‌ను వెంటనే ఏర్పాటు చేయలేకపోయారు. ప్రస్తుతం వారికి వీలు కావడంతో నవంబర్ 12న రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నాగార్జున నిర్ణయించారు. ఈ రిసెప్షన్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు.
కాగా ఇప్పటికే చైతన్య తల్లి లక్ష్మి చెన్నైలోని తన నివాసంలో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు ధరించి ఈ వేడుకలో ఆకట్టుకున్నారు. మరోవైపు తమ వర్క్ కమిట్మెంట్స్ వల్ల ఇద్దరూ తీరిక లేకుండా గడుపుతున్నారు. క్రిస్మస్ సీజన్లో హనీమూన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. యూఎస్ఏతో పాటు యూరఫ్ దేశాల్లో వారు దాదాపు నెల రోజుల పాటు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికొస్తే నాగచైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. సమంత కూడా బిజీగానే వుంది. సమంత నటించిన మెర్సల్ చిత్రం ఇటీవల రిలీజైంది. ప్రస్తుతం అలనాటి నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి'లో, రంగస్థలం సినిమాల్లో నటిస్తోంది. ఇవే కాక మరో తమిళ చిత్రాన్ని కూడా అంగీకరించింది.