ఐడీ కార్డ్స్ తో ఎన్టీఆర్, జక్కన్న... చాలా కాలం అవుతుందంటూ ఎన్టీఆర్ కామెంట్స్

By team teluguFirst Published Aug 6, 2021, 8:43 AM IST
Highlights

ఐడీ కార్డు ధరించిన ఎన్టీఆర్ తన ఫీలింగ్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఐడీ కార్డు ధరించి చాలా కాలం అవుతుందన్న ఎన్టీఆర్, సెట్స్ లో మొదటిసారి ఇలా ఐడీ కార్డు ధరించాను.. అంటూ కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మరో రెండు నెలల్లో విడుదల నేపథ్యంలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో టీమ్ నిమగ్నమయ్యారు.  మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. కాగా ఉక్రెయిన్ షూటింగ్ సెట్స్ లో పాల్గొంటున్న  నటులకు సాంకేతిక నిపుణులకు రాజమౌళి ఐడీ కార్డ్స్ జారీ చేశారు. ఎన్టీఆర్ సైతం మెడలో ఐడీ కార్డు ధరించి కనిపించారు. అలాగే రాజమౌళి ఫొటోలో తన ఐడి కార్డు చూపిస్తున్నారు. 


ఇక ఐడీ కార్డు ధరించిన ఎన్టీఆర్ తన ఫీలింగ్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఐడీ కార్డు ధరించి చాలా కాలం అవుతుందన్న ఎన్టీఆర్, సెట్స్ లో మొదటిసారి ఇలా ఐడీ కార్డు ధరించాను.. అంటూ కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రాజమౌళి నిబంధనలు మేరకో లేక ఉక్రెయిన్ దేశ రూల్స్ వలనో ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో అందరూ ఐడీ కార్డ్స్ ధరించి కనిపించారు. 


మరోవైపు ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. దేశంలోని ప్రధాన భాషలతో పాటు విదేశీ బాషలలో కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలతో ఆర్ ఆర్ ఆర్ అంచనాలు పెంచేసిన రాజమౌళి, మేకింగ్ వీడియోతో మరింత హైప్ తీసుకువచ్చారు. ఆర్ ఆర్ ఆర్ నుండి విడుదలైన మొదటి సాంగ్ దోస్తీ అన్ని బాషలలో ఆదరణ దక్కించుకుంది. 


ఎన్టీఆర్ భీమ్ గా, చరణ్ అల్లూరిగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ కి జంటగా విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్ర ఖని మరో కీలక రోల్ చేస్తుండగా, శ్రీయా తళుక్కున మెరవనుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

click me!