Manchu Lakshmi Request: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్..?

By Mahesh JujjuriFirst Published Jan 22, 2022, 6:29 PM IST
Highlights

మంచువారి వారసురాలు.. మల్టీ టాలెటెడ్ మంచులక్ష్మీ తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వపాఠశాలల గురించి ప్రశంసించారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్ చేశారు లక్ష్మీ.

మంచువారి వారసురాలు.. మల్టీ టాలెంటెడ్ మంచులక్ష్మీ తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వపాఠశాలల గురించి ప్రశంసించారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్ చేశారు లక్ష్మీ.

టాలీవుడ్ లో నటిగానే కాకుండా.. సామాజిక అంశాలపై  కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన మార్క్  స్టైల్లో స్పందిస్తుంటారు మంచు లక్షీ. ముఖ్యంగా చిన్న పిల్లల గురంచి ఎక్కువగా ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వారి  ఎడ్యుకేషన్ గురించి.. వారి బాగోగుల గురించ సమయానుసారంగా కామెంట్స్ చేస్తుంటుంది. రీసెంట్ గా  ఆమె డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి తెలంగాణ ప్రభుత్వానికి  ఓ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న మన ఊరు.. మన బడి ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా బాగా ఉందని ప్రభుత్వాన్నిమంచు లక్ష్మీ ప్రశంసించారు. దాదాపు ఏడేళ్లుగా సొసైటీలో మార్పు కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరుపున ఆమె పలు గవర్నమెంట్ స్కూల్స్ లో  ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయా రంగాల్లో ప్రతిభావంతుల చేత కూడా పాఠాలు చెప్పిస్తున్నారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించి.. విద్యా ప్రమాణాలు పెరగాలన్న ఉద్దేశంతో మంచు లక్ష్మీ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 

 ఆ అనుభవంతోనే మంచు లక్ష్మీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ గురించి విజ్ఞప్తి చేశారు. కొన్ని స్కూల్స్ లో  టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ తరుపున టీచింగ్ ప్రోగ్రామ్స్ చేపట్టినప్పుడు ఐసీటీ గురించి ప్రస్తావన వచ్చిందని.. ఐసీటీ ట్రైనర్ల వలన విద్య ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్య పై చూపిస్తున్న శ్రద్ద వలన మూడేళ్లలో ఆ రంగం మరింత మెరుగుపడుతుందని.. విద్యార్థులలో మెరుగైన ఫలితాలను చూడటానికి తాను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాడానికి రెడీగా ఉన్నట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు.  

click me!