
అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ఫస్ట్ లుక్ కి సిద్దమైంది. బాలీవుడ్ లో వచ్చిన అడల్ట్ సినిమాకు రీమేక్ " బాబు బాగా బిజీ". దానికి ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా..... కుమ్ముడే కుమ్ముడు. హోలీ పండగ సందర్బంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు ఆ చిత్ర యూనిట్. దాంతో అవసరాల సినిమా బూతు సినిమాకు కేరాఫ్ అడ్రస్ లా ఉందని అంటున్నారు.
ఇక ఫస్ట్ లుక్ చూస్తే ఆ బూతు ఏంటో యిట్టె అర్ధమైపోతుంది. పైగా ఈ సినిమాలో ముగ్గురు అందమైన భామలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేస్తోంది. అయితే శృంగారం తోపాటు మంచి సందేశం కూడా ఉంది ఈ చిత్రంలో.