పెళ్లయ్యాక పిల్లలకు చూపించి గొప్పగా చెప్పుకుంటానంటున్న సమంత

Published : Jun 19, 2017, 07:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పెళ్లయ్యాక పిల్లలకు చూపించి గొప్పగా చెప్పుకుంటానంటున్న సమంత

సారాంశం

అఆ.. చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సమంత అవార్డు వేడుకలకు వచ్చేముందు నర్వెస్ గా వున్నావెందుకని అడిగిన చైతూ అవార్డు తీసుకుని పెళ్లయ్యాక పిల్లలకు చూపించి గొప్పగా చెప్పుకుంటానంటున్న సమంత

ఇటీవల జరిగిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల వేడుకలో 'అ..ఆ' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది సమంత. తన కెరీర్లో ఇది 4వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్. అవార్డు ఫంక్షన్‌కు వచ్చే ముందు సమంత కాస్త టెన్షన్ పడుతూ నెర్వస్‌గా కనిపించిందట. అవార్డు తీసుకోవడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్? అని నాగ చైతన్య అడిగితే సమంత ఆసక్తికర సమాధానం చెప్పిందట.

 

నా బిడ్డలు నా గురించి అడిగితే ఈ అవార్డులే చూపిస్తాను అందట. ‘రేపు నాకు పుట్టబోయే బిడ్డలు.... నాన్న పెద్ద స్టార్, మరి నువ్వు ఏమిటని అడగితే వాళ్లకు నేను గెలుచుకున్న ఈ అవార్డులు చూపిస్తాను. నటిగా ఈ అవార్డులు తీసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాను' అని సమంత చెప్పింది.

 

సమంతకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నాగ చైతన్యతో వివాహం తర్వాత వీలైనంత త్వరగా పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అక్టోబర్ 6న సమంత, నాగ చైతన్య వివాహం జరుగబోతున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

 

ఇక పెళ్లి తర్వాత సమంత సినిమాలకు దూరం అవ్వాలా? లేక కొనసాగాలా? అనే విషయంలో నా ప్రమేయం ఏమీ ఉండదని, తనకు ఏది నచ్చితే అది చేస్తుందని చైతన్య ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సమంత మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి