రామ్ చరణ్, సుకుమార్ మూవీలో సమంత

Published : Jan 25, 2017, 10:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రామ్ చరణ్, సుకుమార్ మూవీలో సమంత

సారాంశం

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మూవీ త్వరలో ప్రారంభం కానున్న సుక్కు చెర్రీ మూవీ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అవుట్ మరి ఇన్ అయ్యే లిస్ట్ లో ఎవరు.. సమంతానేనా..

ధృవ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓకే చేసిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను జనవరి 30న లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ ను ఎంపిక చేయలేదు.

 

గత కొద్ది రోజులుగా మలయాళీ బ్యూటి అనుపమ పరమేశ్వరన్ మెగా పవర్ స్టార్ సరసన హీరోయిన్గా అలరించనుందన్న టాక్ వినిపించినా.. ఇప్పుడు మరో పేరు తెర మీదకు వచ్చింది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సమంత హీరోయిన్గా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాగచైతన్యతో పెళ్లి వార్తలు బయటకు వచ్చిన తరువాత సమంత సినిమాలేమీ సైన్ చేయలేదు. అయితే  రామ్ చరణ్ సరసన కావటంతో సమంత ఈ సినిమా చేయాలని భావిస్తోందట.

 

గతంలోనూ రెండు సార్లు రామ్ చరణ్, సమంతల కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరిగాయి. ఎవడు, బ్రూస్లీ సినిమాలకు సమంతను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా వర్క్ అవుట్ కాలేదు. తమిళ్లో రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది సమంత. వీటితో పాటు అఖిల్ వివాహం, తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న సమంత., చెర్రీ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. చూడాలి మరి. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab : స్టేజ్ పైనే బోరున ఏడ్చిన మారుతి, ఓదార్చిన ప్రభాస్, రాజాసాబ్ ఈవెంట్ లో అసలేం జరిగింది?
The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్