Samantha: మరోసారి సమంతపై ట్రోలింగ్.. చైతు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు ఫైర్

pratap reddy   | Asianet News
Published : Nov 24, 2021, 09:46 PM IST
Samantha: మరోసారి సమంతపై ట్రోలింగ్.. చైతు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు ఫైర్

సారాంశం

సమంత, నాగ చైతన్య విడాకులతో వేరుపడి వారాలు గడచిపోతున్నాయి. కానీ అభిమానుల్లో ఇంకా నిరాశ తొలగలేదు. ఆఖరికి చైతు సమంత కూడా ఆ చేదు జ్ఞాపకాలని విడిచిపెట్టి తమ పనుల్లో, కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. 

సమంత, నాగ చైతన్య విడాకులతో వేరుపడి వారాలు గడచిపోతున్నాయి. కానీ అభిమానుల్లో ఇంకా నిరాశ తొలగలేదు. ఆఖరికి చైతు సమంత కూడా ఆ చేదు జ్ఞాపకాలని విడిచిపెట్టి తమ పనుల్లో, కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. కానీ అభిమానుల్లో మాత్రం చైతు, సమంత గురించి నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. 

విడాకుల సంఘటన తర్వాత కొంతమంది అక్కినేని అభిమానులు సమంతని తప్పుబడుతూ ట్రోల్ చేశారు. సమంతపై అనేక నిందలు పడ్డాయి. కానీ samantha అభిమానులు ఆ విమర్శలని తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి సమంతపై ట్రోలింగ్ మొదలైంది. 

నవంబర్ 23న Naga Chaitanya జన్మదిన వేడుకలు జరిగాయి. సోషల్ మీడియాలో సెలెబ్రటీల నుంచి, అభిమానుల నుంచి నాగ చైతన్యకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చైతు సమంత విడిపోయినప్పటికీ.. తన మాజీ భర్తకు సమంత బర్త్ డే విషెష్ చెబుతుందేమోనని కొందరు అభిమానులు ఆశించారు. కానీ సమంత చైతూకి ఎలాంటి విషెస్ తెలియజేయలేదు. 

Also Read: ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్.. అఖండ నుంచి పెద్ద చిత్రాలే, నిర్మాతల ప్లాన్ ?

పైగా తన పెంపుడు కుక్కకు బర్త్ డే విషెష్ చెబుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. దీనితో సమంతపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు కుక్కని ఇచ్చిన ప్రాధాన్యత నాగ చైతన్యకు ఇవ్వలేవా.. చైతు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ విడిపోయారు.. కానీ ఒక స్నేహితురాలిగా అయినా సమంత చైతూకి విషెస్ తెలిపి ఉంటే బావుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ చైతూకి సమంత బర్త్ డే విషెస్ చెప్పడం చెప్పకపోవడం పూర్తిగా తన వ్యక్తిగత విషయం అనేది వాస్తవం. 

ఇక సినిమాల విషయానికి వస్తే చైతు ప్రస్తుతం థ్యాంక్యూ, Bangarraju చిత్రాల్లో నటిస్తున్నాడు. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఓ మూవీ చేస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?