Acharya: 'ఆచార్య' నుంచి పవర్ ఫుల్ అప్డేట్.. చిరుత పులిలా రంగంలోకి 'సిద్ద'

pratap reddy   | Asianet News
Published : Nov 24, 2021, 05:25 PM IST
Acharya: 'ఆచార్య' నుంచి పవర్ ఫుల్ అప్డేట్.. చిరుత పులిలా రంగంలోకి 'సిద్ద'

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. దేవాలయాలు, విప్లవ భావజాలం అంశాలతో కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక టీజర్ విడుదలైనప్పటికీ కథ గురించి ఎలాంటి క్లూ బయట పడకుండా కొరటాల జాగ్రత్త పడ్డారు. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రెండవసారి నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీలో పవర్ ఫుల్ కామియో రోల్ పోషిస్తున్నారు. 'సిద్ద' పాత్రలో రాంచరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు రాంచరణ్ లుక్స్ మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 

తాజాగా ఆచార్య నుంచి వచ్చిన పవర్ ఫుల్ అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ నింపేవిధంగా ఉంది. రాంచరణ్ 'సిద్ద' పాత్రని పరిచయం చేస్తూ నవంబర్ 28న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. పోస్టర్ లో రాంచరణ్ చిరుత కళ్ళతో తుపాకీ చేతబట్టి రంగంలోకి దూకుతున్న క్రేజీ లుక్ వైరల్ గా మారింది. బ్యాగ్రౌండ్ లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 

దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. రాంచరణ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే క్యామియో రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో కొరటాల శివ పొలిటికల్ అంశాలని కూడా ఇన్వాల్వ్ చేశారట. కొరటాల చిత్రాల్లో కమర్షియల్ అంశాలు ఉంటాయి. కానీ ప్రధానంగా సందేశం హైలైట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నటుడు కొరటాల దర్శకత్వంలో నటిస్తే వెండి తెరపై మ్యాజిక్ ఖాయం అని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగా అభిమానులంతా నవంబర్ 28న వచ్చే సిద్ధ టీజర్ కోసం సిద్ధంగా ఉన్నారు. 

Also Read: Pragya jaiswal: ఉప్పెనలా ఉబికి వస్తున్న ఎద అందాలు... టైట్ స్కర్ట్ లో బార్బీ బొమ్మలా అఖండ హీరోయిన్ ప్రగ్యా

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?