ముకుల్‌ దేవ్ మరణానికి అసలు కారణం ఇదే.. సోదరుడు రాహుల్‌ దేవ్ వెల్లడి.. వారిపై ఆగ్రహం

Published : Jun 17, 2025, 11:40 AM IST
Mukul Dev

సారాంశం

రవితేజ హీరోగా వచ్చిన `కృష్ణ` చిత్రంలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ముకుల్‌ దేవ్‌ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు రాహుల్‌ దేవ్‌.. తమ్ముడి మరణానికి కారణం ఏంటో తెలిపారు.  

ఇటీవల మరణించిన నటుడు ముకుల్‌ దేవ్‌ తెలుగులో చాలా సినిమాలే చేశారు. `కృష్ణ`, `ఏక్‌ నిరంజన్‌`, `కేడి`, `అదుర్స్`, `బెజవాడ`, `నిప్పు` వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. కానీ ఆ తర్వాత తెలుగులో అంతగా మూవీస్‌ చేయలేదు. హిందీకే పరిమితమయ్యారు. ఆయన బ్రదర్‌ రాహుల్‌ దేవ్‌ కూడా అనేక తెలుగు చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే  ముకుల్‌ దేవ్‌ హఠాన్మరణం చెందారు. మే 23, 2025 రోజున ఆయన మరణించారు. డిప్రెషన్‌ కారణంగా.నే ఆయన చనిపోయినట్టు ప్రచారం జరిగింది.  అయితే, 24 రోజుల తర్వాత, ఆయన సోదరుడు రాహుల్‌ దేవ్ ఈ వార్తలను ఖండించి, అసలు కారణాన్ని వెల్లడించారు.

ముకుల్‌ దేవ్ ఎలా చనిపోయారు?

అన్న రాహుల్‌ దేవ్ చెప్పిన దాని ప్రకారం, ముకుల్‌ దేవ్ కలుషితమైన ఆహారపు అలవాట్ల వల్ల మరణించారని, సరైన ఫుడ్‌ తీసుకోలేదని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, `ముకుల్ ఎనిమిదన్నర రోజులు ICUలో ఉన్నారు. వైద్యుల చెప్పినదాని ప్రకారం, ఇది చెడు ఆహారపు అలవాట్ల వల్లే జరిగింది. 

చివరి నాలుగు, ఐదు రోజులు ఆయన ఏమీ తినలేదు, త్రాగలేదు.  ఒంటరితనాన్ని ఎక్కువగా ఫేస్‌ చేశాడు. బ్రతకాలనే కోరిక చచ్చిపోయింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించారు. అంత్యక్రియల తర్వాతే నాకు అసలు విషయం అర్థమైంది, దీంతో ఆ బాధ ఇంకా ఎక్కువైంది` అని అన్నారు.

2019లో ఢిల్లీకి మారారు ముకుల్‌ దేవ్

2019లో తండ్రిని చూసుకోవడానికి ముకుల్‌ దేవ్‌ ఢిల్లీకి మారారని, అదే సంవత్సరం ఆయన తండ్రి చనిపోయారని రాహుల్‌ చెప్పారు. 2023లో ఆయన తల్లి కూడా చనిపోయారు. ముకుల్‌ ఒంటరిగా ఉండి, రచనపై దృష్టి పెట్టారని అన్న రాహుల్‌ అన్నారు. 

తన కూతురిని చాలా మిస్ అవుతున్నారని, తనను తాను చూసుకోలేకపోయారని, ఒంటరితనం వల్ల ఎవరూ సహాయం చేయలేకపోయారని రాహుల్‌ చెప్పారు.

డిప్రెషన్ వార్తలపై రాహుల్‌ ఆగ్రహం

ముకుల్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, దాని వల్లే చనిపోయారనే రూమర్స్ పై రాహుల్‌ దేవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆయనతో సంబంధం పెట్టుకోలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని అంటున్నారు, కానీ ఆయన హాఫ్ మారథాన్ పూర్తి చేశారు.  బరువు పెరిగింది, ఎందుకంటే  తనను తాను చూసుకోవడం మానేశారు. 

2019 నుండి 2024 వరకు ఆయన్ని మీరు చూశారా?. ఆయన్ను ఆసుపత్రిలో చూడటానికి వెళ్లారా? ప్రార్థన సభకు హాజరయ్యారా?" అని ప్రశ్నించారు. ముకుల్‌ చాలా చమత్కారమైన, తెలివైన, సున్నితమైన వ్యక్తి అని, ఆయన్ను అలాగే గుర్తుంచుకోవాలని రాహుల్‌ వెల్లడించడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్