
మాస్ హీరో సినిమా అంటే ఐటెం సాంగ్ ఉండాల్సిందే. గత రెండు దశాబ్దాలుగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒకప్పుడు ప్రత్యేకంగా ఐటెం గర్ల్స్ ఉండేవారు. అయితే ఈ మధ్య ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా ఐటెం నంబర్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలిన తమన్నా(Tamannah) చాలా కాలంగా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్, యస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలతో పాటు ఐటమ్స్ సాంగ్స్ లో ఆడిపాడారు.
ఇక సమంత(Samantha) విషయానికి వస్తే... కెరీర్ లో మొదటిసారి పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీలో సమంత అల్లు అర్జున్ (Allu Arjun)కి జంటగా ఊ అంటావా ఊ ఊ అంటావా... సాంగ్ చేశారు. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. బోల్డ్ లుక్ లో సమంత నాటు స్టెప్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. పుష్ప మూవీకి సమంత ఐటం నంబర్ ప్రత్యేకంగా మారింది.
కాగా వరుణ్ తేజ్(Varun Tej) లేటెస్ట్ మూవీ గని. ఈ చిత్రంలో తమన్నా ఓ ఐటెం సాంగ్ చేశారు. ఈ పాట సినిమాలో ఏమంత ప్రభావం చూపించలేకపోయింది. తమన్నా సాంగ్ గురించి ఆడియన్స్ అసలు మాట్లాడటం లేదు. మరోవైపు గని అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సమంత అల్లు అర్జున్ కి హిట్ ఇస్తే... తమన్నా ప్లాప్ ఇచ్చిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా గని (Ghani)ఘోరంగా ఫెయిలైంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డులకు ఎక్కింది. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి గని చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సర్ గా కనిపించడంతో కోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేయడంతో పాటు, ప్రొఫెషనల్స్ వద్ద శిక్షణ తీసుకున్నారు. నెలల తరబడి ఆయన ఈ రోల్ కోసం వరుణ్ కష్టపడ్డారు. కథలో కొత్తదనం లేకపోవడం, పూర్ స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ పండగ పోవడంతో గని బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దాదాపు రూ. 26 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 4 కోట్లు కూడా వసూలు చేసే పరిస్థితి లేదు.