తాజాగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. తెల్లని దుస్తులలో ఒక అటవీ ప్రాంతంలో సమంత పోస్టర్లో చాలా అందంగా కనిపించింది. అ.ికే ఈ పోస్టర్ గురించి మీడియా లో కానీ సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు.
సినిమా రిలీజ్ అయ్యేముందు డేట్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కు కూడా టైమ్ చూసుకుంటారు. అవేమీ చూసుకోకుండా ,మన లెక్కలేవో మనం వేసుకుని మూవీ ప్రమోషన్స్ లోకి దూకితే ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు అదే పరిస్దితి సమంత తాజా చిత్రం శకుంతలం కు ఎదురైంది.
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
మన పురాణ కావ్యాల్లోని శకుంతల మరియు దుష్యంతుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమంత శకుంతల పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. తెల్లని దుస్తులలో ఒక అటవీ ప్రాంతంలో సమంత పోస్టర్లో చాలా అందంగా కనిపించింది. అ.ికే ఈ పోస్టర్ గురించి మీడియా లో కానీ సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు.
అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ చనిపోవడం వల్ల వాయిదా వేయటం. ఈ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో సమంత అందమైన పోస్టర్ ని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడటం లేదంటున్నారు. అయితే పోస్టర్ చాలా నాశిగా ఉంది...సమంత శకుంతల పాత్రలో ఏమాత్రం బాగోలేదని అందుకే లైట్ తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏదైతైనా ఓ ప్రయత్నం వృధా అయ్యింది.