
సమంత గత కొంతకాలంగా ఏదో ఒక విషయంలో జనాల నోట్లో నానుతూనే ఉంది.కొన్నిసార్లు ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. తాజాగా మరోసారి ఓ రేంజిలో ట్రోలంగ్ గురి అవుతోంది. అయితే ఆమెను ట్రోల్ చేయటం పద్దతి కాదు అని కొందరు అంటున్నారు. అసలేం జరిగిందో చూసి అప్పుడు ఓ నిర్ణయానికి వద్దాం
రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సైబీరియాలో ఉన్న సమంత అక్కడ ఓ పబ్బులో హుషారుగా పుష్పలో ఊ అంటావా ఉహు అంటావా పాటకు డాన్సు చేసింది. సమంత స్టార్ కాబట్టి ఆ వీడియో ట్విట్టర్, ఇన్స్ టాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇలాంటి అవకాసం కోసం చూస్తున్న యాంటీ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. యశోద, శాకుంతలం ప్రమోషన్లలో పదే పదే హెల్త్ కంప్లైంట్ గురించి ప్రస్తావించి కన్నీళ్ళు పెట్టుకుని, సానుభూతి కార్డు ప్లే చేసిన సామ్ హఠాత్తుగా ఫారిన్ వెళ్ళగానే హుషారుగా చలాకీగా మారిపోవడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని ట్రోల్స్ మొదలుపెట్టారు.
తన సినిమాలను జనాలు థియేటర్లకు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రతిసారి సింపతీ కార్డు ప్లే చేయడం వర్కౌట్ కాదని ఈ సందర్భంగా చురకలు వేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో చూస్తుంటే...సమంత రికవర్ అయ్యింది. కానీ శాకుంతలం టైంలో మాత్రం నీరసంగా, కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇబ్బందిగా కనిపించింది
మరో ప్రక్క సమంత ఎలాగూ సెప్టెంబర్ లో విడుదల కాబోయే విజయ్ దేవరకొండ ఖుషి ప్రమోషన్ల కోసం తిరిగి హైదరాబాద్ రావాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు మీడియా నుంచి ఎదురవుతాయి. సిటాడెల్ హాలీవుడ్ వెర్షన్ ఫెయిలైన నేపథ్యంలో ఇండియన్ రీమేక్ ని రాజ్ అండ్ డికె ఎలా తీసుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. చూడాలి మరి ఏం చేస్తుందో అనే టెన్షన్ మరో వైపు సమంత ఫ్యాన్స్ కు.