
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. `హరిహర వీరమల్లు` షూటింగ్ అనుకున్నట్టుగా సాగడం లేదు. దీంతో ఈ గ్యాప్‌లో `ఓజీ`, `బ్రో`, `ఉస్తాద్ భగత్‌సింగ్` సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నాడు పవన్. తన కెరీర్‌లో మొదటిసారి ఆయన ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం, ఇంతటి బిజీగా ఉండటం. వచ్చే ఏపీ ఎన్నికలు వచ్చే లోపు ఈ సినిమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కావాలనేది పవన్ టార్గెట్. అందుకే రెస్ట్ లేకుండా షూటింగ్‌లు చేస్తున్నారు.
`బాలు`, `పంజా` వంటి చిత్రాల తర్వాత పవన్ గ్యాంస్ స్టర్ మూవీ చేస్తున్నారు. `ఓజీ` గ్యాంగ్‌స్టర్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో `విక్రమ్` ఫేమ్ అర్జున్ దాస్` ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా శనివారం ఆయన `ఓజీ` సెట్ లోకి అడుగుపెట్టారు. రెండు రోజుల క్రితం పవన్ ఈ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ లీక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కథకి కొరియన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని టైటిల్ లోని అర్థాన్ని బట్టి అర్థమవుతుంది. పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారట. ఇవన్నీ ఓ ఎత్తైతే ఈ సినిమా బ్యాక్ డ్రాప్‌కి సంబంధించిన వార్త ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా 1950లో జరిగే కథ అని తెలుస్తుంది. ఆ పీరియడ్‌లో పవన్ పెద్ద గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తారట. దీనికి సంబంధించిన పవన్ వింటేజ్ లుక్ అదిరిపోతుందని, పవన్ పాత్ర చాలా సీరియస్‌గా సాగుతుందని అంటున్నారు. అంతేకాదు ఇందులో ఒళ్లు గగుర్పొడే యాక్షన్ ఎపిసోడ్లు ప్లాన్ చేశారట సుజీత్ టీమ్. అవి సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, అంతేకాదు టాలీవుడ్ సినిమాల్లోనూ అలాంటి యాక్షన్‌ని ఇప్పటి వరకు చూడలేదు అనేట్టుగా ఉండబోతుందట.
ఇదిలా ఉంటే ఈ సినిమాని రెండు పార్ట్ లుగానూ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ `ఓజీ`కి సంబంధించిన అప్‌డేట్ లీక్‌లు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్ కి మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు తప్పవంటున్నారు నెటిజన్లు. మరి పవన్ చేసిన గత రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. `ఓజీ` ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాయా? అనేది చూడాలి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ విడుదల చేసే అవకాశం ఉంది.