Samantha: హమ్మయ్య ఓ పనైపోయిందంటున్న సమంత, ఇంక రిలీజే తరువాయి

Published : Apr 17, 2022, 06:46 PM IST
Samantha: హమ్మయ్య ఓ పనైపోయిందంటున్న సమంత, ఇంక రిలీజే తరువాయి

సారాంశం

డివోర్స్ తరువాత కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది సమంత. మొన్నటి వరకూ  టాలీవుడ్ కే పరిమితమైన సామ్ హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది. ఇక వరుసగా ఓక్కో సినిమాను కంప్లీట్ చేసుకుంటూ వస్తోంది.

డివోర్స్ తరువాత కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది సమంత. మొన్నటి వరకూ  టాలీవుడ్ కే పరిమితమైన సామ్ హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది. ఇక వరుసగా ఓక్కో సినిమాను కంప్లీట్ చేసుకుంటూ వస్తోంది.

చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది సమంత. తెలుగు, తమిళ సినిమాలతో పాటు హాలీవుడ్ పై కూడా ఓ కన్నేసింది సామ్. ఇక ప్రస్తుతం  ఆమె నటించిన  తమిళ   సినిమా కాతు వాకుల రెండు కాదల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు మరికోన్ని సినిమాలు పనుల్లో సామ్ బిజీ అయిపోయింది. కాస్త టైమ్ దొరికితే...వెకేషన్ టూర్లతో సందడి చేస్తోంది. 

తెలుగులో సమంత చేతిలో రెండు ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమాతో పాటు యశోద సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తోంది సమంత. ఇక తాజాగా శాకుంతలం సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ను షేర్‌ చేసింది సామ్. ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. 

శాకుంతలం  సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ పూర్తి చేశానంటూ సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనౌన్స్ చేసింది.  దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసుకుంది.గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇక ఈసినిమాలో శకుంతలగా సమంత టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ యంగ్  హీరో  దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్  ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమూవీలో శకుంతల చిన్ననాటి పాత్రను చేయబోతుంది అర్హ. ఇక  త్వరలోనే ఈ మూవీ  రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?