
ఈవారం విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టిస్తుంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ వీకెండ్ ముగిసే నాటికి రెండు వందల కోట్లకు చేరువ కానుంది. దేశవ్యాప్తంగా కెజిఎఫ్ 2 మూవీ ఆదరణ దక్కించుకుంటుంది. విడుదలైన అన్ని భాషల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ హీరో యష్ ని పొగుడుతూ కంగనా సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు.
ఎన్నో దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమ ఇలాంటి నటుడు కోసమే ఎదురు చూస్తుంది. అమితాబ్ తర్వాత ఏర్పడిన లోటు యష్ భర్తీ చేశాడు. యష్ (Yash) ఓ అద్భుతమైన నటుడు అంటూ కొనియాడారు. అలాగే టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్, అల్లు అర్జున్ లను కంగనా ప్రత్యేకంగా పొగిడారు. టాలెంట్ పుష్కలంగా ఉండడంతో పాటు హార్డ్ వర్క్ చేసే సౌత్ హీరోలు, ఎక్కడైనా ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతారు. సంప్రదాయాలకు వారిచే ప్రాధాన్యత వంటి లక్షణాలు వాళ్ళను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయంటూ ఆమె మెచ్చుకున్నారు.
ఇక్కడ కంగనా (Kanagana Ranaut) దక్షిణాది హీరోలను పొగుడుతూనే బాలీవుడ్ స్టార్స్ ని ఎద్దేవా చేశారు. సౌత్ హీరోల ముందు వాళ్ళు దిగడుపు అన్నట్లు పరోక్షంగా తన అభిప్రాయం వెల్లడించారు. గతంలో కూడా ప్రస్తుతం దేశంలో టాలీవుడ్ అతిపెద్ద పరిశ్రమ, బాలీవుడ్ కి తెలుగు పరిశ్రమతో పోటీపడే సత్తా లేదంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు.
ఇక ఇటీవల విడుదలైన మూడు సౌత్ చిత్రాలు బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించాయి. అల్లు అర్జున్ పుష్ప రూ. 100 కోట్ల వసూళ్లతో అనూహ్యమైన విజయం సొంతం చేసుకుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ రూ. 250 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ కెజిఎఫ్ చాప్టర్ 2 వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. చూస్తుంటే ఈ మూవీ హిందీలో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. బాహుబలి 2 హిందీ వర్షన్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.